టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల కొన్ని టెలికాం సర్వీసులు వాటి టారిఫ్ లను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే నేపద్యంలో రిలయన్స్ సంస్థ జియో కూడా టారిఫ్ లను పెంచింది. దీంతో కస్టమర్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కానీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకున్న జియో రూ.98, రూ.149గా ఉన్న పాత ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతుంది. ఈ మధ్యే మొబైల్ టారిఫ్‌లకు పెంచి వాటికి అనుగుణంగా నూతన ప్లాన్లను కూడా లాంచ్ చేసింది జియో.
ఇక పోతే పాత టారిఫ్ ప్రకారం రూ.98 ప్లాన్‌లో కస్టమర్లకు 2జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ 28 రోజుల వాలిడిటీని నిర్ణయించారు. అదే విధంగా రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాల నాన్ జియో, వాలిడిటీ 24 రోజులుగా నిర్ణయించింది. ఇక జియో నెట్ వర్క్ ను వాడుతున్న కస్టమర్లు పాత టారిఫ్లతో అన్ లిమిటెడ్ కాల్స్ తో ఎంజాయ్ చేయొచ్చు.