LPG Cylinder Price: లోక్‌సభ ఎలక్షన్స్‌కు ముందు గ్యాస్‌ ధర మరింత తగ్గుతుందా..!

LPG Cylinder Price: మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-04-02 12:09 GMT

LPG Cylinder Price: లోక్‌సభ ఎలక్షన్స్‌కు ముందు గ్యాస్‌ ధర మరింత తగ్గుతుందా..!

LPG Cylinder Price: మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వంట గ్యాస్‌ ధరలు కూడా తగ్గుతాయని అంటున్నారు. గత కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. రూ.400కి లభించే గ్యాస్ నేరుగా రూ.1100కే చేరింది. గత ఆరు నెలల్లో రెండుసార్లు తగ్గింది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర రూ.930లోపే ఉంది. ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కానుక అందించారు. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి 1న ప్రభుత్వ కంపెనీలు వాణిజ్య గ్యాస్ ధరను పెంచాయి. దేశీయ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మార్చి 8న సిలిండర్ ధర మాత్రం రూ.100 తగ్గింది. గతేడాది ఆగస్టు 29, 2023న కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. అప్పట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లు రూ.200 తగ్గించారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.

గత ఏడు నెలలుగా 14.2 కిలోల సిలిండర్ ధర రూ.902.50గా ఉంది. మార్చి నెలలో రూ.100 తగ్గించిన గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.802.50కి తగ్గింది. ఏడు నెలలుగా ప్రభుత్వ కంపెనీలు దేశీయ గ్యాస్ ధరలను పెంచలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ ధరను ప్రస్తుతం పెంచలేదు. కానీ 300 రూపాయలు తగ్గించారు. కొన్ని నెలల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ మార్పు కస్టమర్లకు ఎంతో ఊరటనిచ్చింది. అయితే ఎలక్షన్స్‌ ముందు మరింత ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News