ఆకట్టుకునే ఆఫర్లు..రిపబ్లిక్‌ డే సేల్‌ షురూ

స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకునే కస్టమర్ల కోసం ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది.

Update: 2020-01-19 07:42 GMT

స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకునే కస్టమర్ల కోసం ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ రోజు ప్రారంభించిన రిపబ్లిక్‌ డే సేల్‌ను ఈ నెల ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగించనుంది. ఈ ఆఫర్లలో యువత ఎంతగానో ఇష్టపడే ఫోన్లను డిస్కౌంట్ ఆఫర్లలో అందిస్తుంది. అంతే కాదు వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లాయిడ్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు వివిధ డివైస్‌లపై కూడా బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

ఇక ఆఫర్లను అందించే కంపెనీలలో ముఖ్యంగా చూసుకుంటే

♦ ఆపిల్‌ కంపెనీలో ఆపిల్ ఐఫోన్‌ 7, XS, ఐఫోన్‌ 8,

♦ రియల్‌మి 3ఐ, 3, 5 ప్రొ, ఎక్స్‌,

♦ లెనోవో కె10 ప్లస్‌, కె10 నోట్‌, అసుస్‌ మ్యాక్స్‌ ప్రొ ఎం1, మ్యాక్స్‌ ఎం2, అసుస్‌ 5జడ్‌,

♦ నోకియా 8 సిరోకో, నోకియా 7.2,

♦ గూగుల్‌ పిక్సల్‌ 3ఎ ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌ 3ఎ,

♦ ఒప్పో ఎఫ్‌11 ప్రొ, ఎ3ఎస్‌, ఎఫ్‌11, కె1,

♦ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్లస్‌, ఎ50ఎస్‌,

♦ రెడ్‌మీ నోట్‌ 7 ప్రొ, రెడ్‌మీ 8ఎ, పోకో ఎఫ్‌1, ఎంఐ ఎ3,

♦ మోటో ఇ6ఎస్‌, మోటోరోలా వన్‌ యాక్షన్‌, వన్‌ మాక్రో,

♦ వివో జడ్‌1ప్రొ, జడ్‌1ఎక్స్‌, వి15,

♦ హానర్‌ 10 లైట్‌, హానర్‌ 20 తదితర ఫోన్లు ఉన్నాయి.

ఈ ఫోన్లకు ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీకు నచ్చిన ఫోన్ ని అతి తక్కువ ధరకు మీ సొంతం చేసుకోండి. 

Tags:    

Similar News