Investment Plan: ప్రతి రోజు రూ. 17 ఆదా చేస్తే చాలు.. అదే మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తుంది..!
Investment Plan: మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు ఏమి ప్లాన్ చేసారు. ఇప్పటివరకు ఏది చేయకపోతే వెంటనే పొదుపు ప్రారంభించండి..
Investment Plan: మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు ఏమి ప్లాన్ చేసారు. ఇప్పటివరకు ఏది చేయకపోతే వెంటనే పొదుపు ప్రారంభించండి. ఉత్తమ పెట్టుబడుల కోసం మీకు తెలిసిన వారి సలహా కూడా తీసుకోవచ్చు. దీనికోసం మార్కెట్లో కొన్ని స్కీములు ఉన్నాయి. అందులో ఒక స్కీం గురించి ఈ రోజు తెలుసుకుందాం. మీరు ప్రతిరోజూ చిన్న పెట్టుబడులు చేసినప్పటికీ అది పెద్ద ఫండ్‌ను సృష్టించగలదు. మీరు చిన్న పెట్టుబడితో పెద్ద ఫండ్ ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం. నెలకు 500 అంటే రోజూ చూసుకుంటే దాదాపు రూ.16.66 (రూ.17)గా ఉంది. ప్రతిరోజూ 17 రూపాయలు ఆదా చేయడం పెద్ద విషయం కాదు.
SIPలో మంచి రాబడి
ప్రారంభంలో మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ. 500 SIPతో మిలియనీర్ కావాలనే మీ కల నెరవేరుతుంది. రూ. 500 నుంచి రూ. 1 కోటి నిధిని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం? మీరు మ్యూచువల్ ఫండ్లలో రోజుకు రూ. 17 (నెలకు రూ. 500) పెట్టుబడి పెట్టాలి. గత కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్ 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి.
20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్
ప్రతిరోజు రూ.17 అంటే నెలకు రూ.500 పెట్టుబడి పెట్టాలి. ఈ మొత్తాన్ని 20 ఏళ్లపాటు డిపాజిట్ చేయడం ద్వారా మీరు రూ. 1.2 లక్షలు డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్లలో, ఏటా 15% రాబడితో మీ ఫండ్ రూ.7 లక్షల 8 వేలకు పెరుగుతుంది. మనం 20 శాతం వార్షిక రాబడి గురించి మాట్లాడినట్లయితే ఈ ఫండ్ రూ. 15.80 లక్షలకు పెరుగుతుంది.
30 ఏళ్ల పెట్టుబడి కోటీశ్వరులను చేస్తుంది
ప్రతి నెలా రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్లలో రూ.1.8 లక్షలు పోగుపడతాయి. ఇప్పుడు మీరు దీనిపై 30 సంవత్సరాలకు 20 శాతం వార్షిక రాబడిని పొందినట్లయితే మీ ఫండ్ 1.16 కోట్లకు పెరుగుతుంది. ఇందులో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంటుంది. మీరు చిన్న మొత్తంలో పెట్టుబడితో పెద్ద నిధులను సంపాదించవచ్చు అనేదానికి ఇదే ఉదాహరణ.