EPF Alert: ఈపీఎఫ్‌ అలర్ట్‌.. ఉద్యోగం మారినట్లయితే ఈ పని తప్పక చేయండి..!

EPF Alert: రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందిపడొద్దని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌) ప్రారంభించింది.

Update: 2023-07-25 14:30 GMT

EPF Alert: ఈపీఎఫ్‌ అలర్ట్‌.. ఉద్యోగం మారినట్లయితే ఈ పని తప్పక చేయండి..!

EPF Alert: రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందిపడొద్దని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌) ప్రారంభించింది. ఇందులో చేరిన ఉద్యోగులు డిపాజిట్‌ చేసిన నిధులని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రైవేట్‌ రంగంలో చాలామంది తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఈపీఎప్‌ ఖాతాలోని సమాచారాన్ని అప్‌డేట్ చేయడం ముఖ్యం. ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఆ సమాచారాన్నిఈపీఎప్‌ ఖాతాలో కచ్చితంగా అప్‌డేట్‌ చేయాలి. అది ఏ విధంగా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

పీఎఫ్ ఖాతా బదిలీ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం మారితే PF ఖాతాను బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనికి ముందు సదరు వ్యక్తి తనను తాను ఆ కంపెనీలో ఉద్యోగిగా నమోదు చేసుకోవడం అవసరం. తర్వాత మాత్రమే EPF ఖాతాను మరొక ఖాతాకు బదిలీ చేయగలరు. కంపెనీని మార్చిన తర్వాత నిష్క్రమణ తేదీని రెండు నెలలలోపు అప్‌డేట్ చేయాలి. దీని గురించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకుంటూ ఉద్యోగులు నిష్క్రమణ తేదీని స్వయంగా అప్‌డేట్ చేసుకోవచ్చని EPFO ట్వీట్ చేసింది. దాని సులభమైన ప్రక్రియ గురించి తెలుసుకోండి.

నిష్క్రమణ తేదీని ఎలా అప్‌డేట్ చేయాలి..?

1. దీని కోసం ముందుగా ఉద్యోగి https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కి వెళ్లాలి.

2. తర్వాత UAN, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

3. తర్వాత మేనేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్‌ని ఎంచుకోవాలి.

4. తర్వాత కిందికి వెళ్లి PF ఖాతా నంబర్‌ను ఎంచుకోవాలి.

5. అప్పుడు కంపెనీని విడిచిపెట్టిన నిష్క్రమణ తేదీని ఎంచుకోవాలి.

6. తర్వాత OTPని పొందడానికి Send OTPపై క్లిక్ చేయాలి. ఆపై మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

7. తర్వాత చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి అప్‌డేట్‌ ఎంపికను ఎంచుకోవాలి.

Tags:    

Similar News