Term Insurance Mistakes: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే చాలా ఇబ్బందులు..!

Term Insurance Mistakes: ఈ రోజుల్లో ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం.

Update: 2023-03-02 07:31 GMT

Term Insurance Mistakes: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే చాలా ఇబ్బందులు..!

Term Insurance Mistakes: ఈ రోజుల్లో ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఆపద సమయంలో ఇన్సూరెన్స్‌ అనేది కుటుంబానికి అండగా నిలుస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమా పాలసీలో ఒక భాగం. ఇది మరణం సంభవించినప్పుడు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణను అందిస్తుంది. వ్యక్తిలేని లోటుని భర్తీ చేస్తుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు మీ కుటుంబ అవసరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని టర్మ్ బీమాను కొనుగోలు చేయాలి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ వార్షిక ఆదాయానికి కనీసం 9 నుంచి 10 రెట్లు ఉండాలని గుర్తుంచుకోండి.

2. మీ వయస్సు, ఆర్థిక బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు మొదలైన వాటి గురించి ఆలోచించి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవాలి. దీనివల్ల మీరు లేకున్నా మీ కుటుంబం ఎవ్వరిపై ఆధారపడకుండా సొంతంగా బతకగలుగుతుంది. ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ముందు అవసరమైన లైఫ్ కవర్ మొత్తాన్ని ఎంచుకోవాలి.

3. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది అనారోగ్యం గురించి సమాచారం అందించరు. ఇలాంటి తప్పు అస్సలు చేయవద్దు. ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా ఆ విషయం బీమా కంపెనీకి చెప్పాలి. దీని వల్ల క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

4. మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా కనీసం 60 ఏళ్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో 85 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News