Diwali Mistakes: దీపావళి సీజన్‌లో ఈ తప్పులు చేయవద్దు.. తర్వాత చాలా ఇబ్బందులు పడుతారు..!

Diwali Mistakes: దీపావళి పండుగ దగ్గరలోనే ఉంది. పండుగ సెలబ్రేషన్స్‌కి అందరూ సిద్దమవుతున్నారు. కొందరు షాపింగ్ చేస్తుంటే మరికొందరు ఇల్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Update: 2023-11-10 02:30 GMT

Diwali Mistakes: దీపావళి సీజన్‌లో ఈ తప్పులు చేయవద్దు.. తర్వాత చాలా ఇబ్బందులు పడుతారు..!

Diwali Mistakes: దీపావళి పండుగ దగ్గరలోనే ఉంది. పండుగ సెలబ్రేషన్స్‌కి అందరూ సిద్దమవుతున్నారు. కొందరు షాపింగ్ చేస్తుంటే మరికొందరు ఇల్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ సమయంలో కొన్ని పొరపాట్లకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తర్వాత చాలా బాధపడుతారు. పండుగ తర్వాత ఈ తప్పులు మిమ్మల్ని డబ్బుపై ఆధారపడేలా చేస్తాయి. దీపావళి సందర్భంగా ఈ తప్పులు అస్సలు చేయవద్దు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మితిమీరిన ఖర్చు: పండుగలకు సిద్ధమవుతున్నప్పుడు చాలాసార్లు బడ్జెట్‌ను మించి ఖర్చుచేస్తాం. అధిక ఖర్చును నివారించాలి.

పొదుపుపై శ్రద్ధ చూపడం లేదు: దీపావళి సందర్భంగా పొదుపు చేసే అలవాటును వదులుకుంటాం. అయితే ఇది అస్సలు మంచిదికాదు. నెలవారీ పొదుపులను కొనసాగించాలి. మిగిలిన ఖర్చులను బడ్జెట్‌లో కవర్ చేయాలి.

క్రెడిట్ కార్డ్‌ని అధికంగా ఉపయోగించడం: షాపింగ్ చేసేటప్పుడు చాలా సార్లు క్రెడిట్ కార్డ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా అస్సలు చేయకూడదు. మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ బడ్జెట్ దీపావళి రోజున కూడా అలాగే ఉంచాలి. లేకపోతే క్రెడిట్ కార్డ్ ఖర్చులు మిమ్మల్ని తర్వాత అప్పుల్లో బంధిస్తాయి.

బేరం చేయాలి: మీరు దీపావళి షాపింగ్ కోసం బయటికి వెళితే కచ్చితంగా బేరం చేయాలి ఈ సమయంలో చాలామంది వ్యాపారులు ఎక్కువ ధరలు చెబుతారు. షాపింగ్ చేసేటప్పుడు మీరు తెలివైన వినియోగదారుగా ప్రవర్తించాలి బాగా బేరం చేసి వస్తువులను కొనుగోలు చేయాలి.

సడెన్‌గా వేటిని కొనవద్దు: సడెన్‌గా వేటిని కొనవద్దు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇది మీ అధిక వ్యయం, క్రెడిట్ కార్డ్‌ల మితిమీరిన వినియోగం, పొదుపు పట్ల నిర్లక్ష్యంపై ప్రభావం చూపుతాయి. సాధారణ బడ్జెట్‌లోనే పండుగను జరుపుకునే విధంగా ప్లాన్‌ చేసుకోవాలి.

Tags:    

Similar News