Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: చివరి గంటలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో లాభాలు
Stock Market: తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల పయనం చివరకు లాభాలతో ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరి గంటన్నర ముందు వరకు తీవ్ర ఊగిసలాటలో పయనించాయి. చివరకు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్పష్టమైన లాభాలను నమోదు చేశాయి. దీంతో రెండు రోజుల సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ఇంట్రాడేలో సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 204.16, నిఫ్టీ 95 పాయింట్లతో లాభాల్లో ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద నిలిచింది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, టైటన్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు మాత్రమే స్వల్ప నష్టాల్లో స్థిరపడ్డాయి.