బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్‌ గోల్డ్.. రకరకాల డిజైన్లలో రోల్డ్ గోల్డ్ నగలు

*రోల్డ్ గోల్డ్ కి పెరిగిన డిమాండ్.. రకరకాల డిజైన్లలో రోల్డ్ గోల్డ్ నగలు

Update: 2023-01-22 06:51 GMT

బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్‌ గోల్డ్.. రకరకాల డిజైన్లలో రోల్డ్ గోల్డ్ నగలు

One Gram Gold: వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్‌. ఉంగరం.. చేతికి గాజులు...నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు... విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు...తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం. ఇలా రకాలు. బంగారు ఆభరణాలు. అధునాతన డిజైన్లలో ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అంతే కాదు కారు చౌకగా ఈ నగలు దొరుకుతున్నాయి. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా ? వాచ్ దిస్ స్టోరీ.

బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్‌ గోల్డ్, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

సంపన్న వర్గాలకు చెందిన మహిళలు కూడా ఫంక్షన్లలో రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్‌ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ధర కూడా తక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతున్నారు.

చౌకర్ ,నెక్ సెట్, బ్యాంగిల్స్ ఇలా జ్యువలరీ లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. తిస్కునే జ్యువలరీని బట్టి ధర ఉంటుంది. అలాగే ఎన్ని రోజులు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయ్ అనేది క్వాలిటీని బట్టి ఉంటుంది. వేసుకున్న డ్రస్ కు మ్యాచ్ అయ్యేలా నగలు లభిస్తుంటంతో 1 గ్రామ్ గోల్డ్ జ్యువలరీ కి డిమాండ్ పెరుగుతుంది. గోల్డ్ లో ఉన్న అన్ని వెరైటీస్ కూడా 1 గ్రామ్ గోల్డ్ లో అవైలబుల్ ఉంటాయని, బట్టి ధర ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు

ప్రస్తుతం గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి పెద్ద తేడా ఏమీ తెలియదు. గోల్డ్ లో ఉన్న డిజైన్స్ రోల్డ్ లో కూడా దొరుకుతాయి. మధ్య తరగతి, పేదవారూ సైతం కొనడానికి వీలుగా ఉంటుంది. అందుకే 1 గ్రామ్ గోల్డ్ కి క్రేజ్ పెరుగుతోంది. 

Tags:    

Similar News