Gold Rate Today: ఆల్ టైం రికార్డు వైపు బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?
Gold Rate Today: బంగారం ధరలు నేడు పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సెప్టెంబర్ 16 సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నేడు 24 క్యారట్ల బంగారం ధర రూ. 74,900 గా పలుకుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ. 68,750గా పలికింది. బంగారం ధరలు గడచిన మూడు నాలుగు రోజులుగా విపరీతంగా పెరగడం ప్రారంభించాయి.
Gold Rate Today: గత మూడు రోజుల్లోనే బంగారం ధర దాదాపు 2000 రూపాయల వరకు పెరిగింది. త్వరలోనే బంగారం ధర 75 వేల రూపాయల మార్కును టచ్ చేయబోతోంది. దీంతో మరోసారి బంగారం ధరలు రికార్డు స్థాయిని నమోదు చేయనున్నాయి. అమెరికాలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకాయి. ఈ కారణంగానే మనదేశంలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందనే వార్తలు మరింత బలోపేతం చేస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో నష్టం వస్తుందని వార్తలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్త చర్యగా తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఈ కారణంగా పసిడి ధరలు రికార్డు స్థాయిని తాగుతున్నాయి.
బంగారం ధరలు దేశీయంగా కూడా కొత్త రికార్డులను తాకుతున్నాయి. దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. రాబోయే ఫెస్టివల్ సీజన్లో బంగారం కొనుగోలు చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. రెండు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు త్వరలోనే 80,000 మార్పును టచ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే బంగారం ఆల్ టైం రికార్డు స్థాయి వద్ద ఉంది ఇలాంటి సమయంలో మీరు బంగారం కొనుగోలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గిన మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బంగారం క్వాలిటీ విషయంలో హాల్ మార్క్ బంగారాన్ని ప్రామాణికంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా హాల్ మార్కు ఉన్న బంగారం మాత్రమే విక్రయించాలని ఇప్పటికే చట్టాన్ని కూడా ప్రవేశపెట్టింది.