Flipkart Big Billion Days Sale 2024: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్...ఈ సేల్స్ ఎప్పటినుంచంటే?

Flipkart Big Billion days 2024: కొద్ది రోజుల్లో పండగల సీజన్ షురూ కాబోతోంది. ఈ నేపథ్యంలో బంపర్ ఆఫర్ సేల్స్ కు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీంతో ఈసారి సేల్స్ కస్టమర్లు భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ పొందనున్నారు. ఈ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం.

Update: 2024-09-16 06:30 GMT

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభం కానుంది. ఈ సేల్ 30 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై గొప్ప తగ్గింపు ఆఫర్‌లు ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం సేల్ ఒకరోజు ముందుగానే అనగా సెప్టెంబర్ 29, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో, దసరా, దీపావళి సందర్భంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్లు ప్రకటించింది.

. ఐఫోన్ 15, ఐఫోన్ 14 ధరలను తగ్గించారు. అదే సమయంలో, సెల్ బ్యాంక్ ఆఫర్‌లు,డిస్కౌంట్లు ఉన్నాయి. దీని సహాయంతో వినియోగదారులు ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 14లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, స్మార్ట్ టీవీ, ఎలక్ట్రానిక్స్ & ఉపకరణాలు, గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రాబోయే రోజుల్లో అమెజాన్ డీల్స్ మరిన్ని డిస్కౌంట్స్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈసేల్‌లో, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 50 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. స్మార్ట్ టీవీ, గృహోపకరణాల ఉత్పత్తులను 80 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. త్వరలో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్, డిస్కౌంట్లను ప్రకటించనున్నారు. ఇది కాకుండా, తక్షణ తగ్గింపు, నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంటుంది. మీరు అదనపు పొదుపులు , క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందుతారు. వినియోగదారులు ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, గేమింగ్, కన్సోల్‌లు, ఇతర సాంకేతిక ఉపకరణాలపై 50 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. సేల్ సమయంలో ఎక్కువ ఫోకస్ ఉండే కేటగిరీలలో స్మార్ట్ టీవీ, గృహోపకరణాలు ఉన్నాయి. ఇందులో రిఫ్రిజిరేటర్లు, 4K స్మార్ట్ టీవీలు ఉన్నాయి. వీటిపై మీరు 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించవచ్చు. అమెజాన్ సేల్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అమెజాన్ సేల్ సెప్టెంబర్ 29 లేదా 30న ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News