Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులం పసిడి ధర రూ. 75,000 దిశగా అడుగులు

Gold Rate Today: బంగారం ధర చుక్కలను తాకుతోంది. సెప్టెంబర్ 15 ఆదివారం బంగారం భారీగా పెరిగింది. తులం బంగారం పై ఏకంగా 400 రూపాయలు పైన పెరిగింది. దీంతో పసిడి ధరలు ఇలా నమోదు అయ్యాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,900 రూపాయలు పలుకగా. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,700 రూపాయలు పలికింది.

Update: 2024-09-15 01:35 GMT

Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులం పసిడి ధర రూ. 75,000 దిశగా అడుగులు

Gold Rate Today: బంగారం ధర చుక్కలను తాకుతోంది. సెప్టెంబర్ 15 ఆదివారం బంగారం భారీగా పెరిగింది. తులం బంగారం పై ఏకంగా 400 రూపాయలు పైన పెరిగింది. దీంతో పసిడి ధరలు ఇలా నమోదు అయ్యాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,900 రూపాయలు పలుకగా. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,700 రూపాయలు పలికింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న డిమాండ్ కూడా కారణంగా చెప్పవచ్చు.

మన దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా పెద్ద ఎత్తున బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్ రీత్యా పసిడి ధరలు భారీగా నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక దీనికి తోడు బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన డిమాండ్ కూడా ప్రధానమని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 2650 డాలర్ల వద్దకు చేరింది. గత వారంతో పోల్చితే బంగారం ధర ఏకంగా 150 డాలర్లు పెరిగింది. దీంతో బంగారం ధరలు దేశీయంగా కూడా భారీగా పెరుగుతున్నాయి.

దీనికి తోడు అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందని వార్తలు వస్తున్నాయి. అటు డాలర్ కూడా 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లోనూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఒడిదుడుకులకు లోనైనా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తుంటారు.

ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడి స్థానం. అందుకే పసిడి ధరలు ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి భారీగా పెరుగుతాయి. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి 75 వేల సమీపానికి చేరాయి. రెండు ఇలాగే కొనసాగితే 80 వేల రూపాయలు తాకడం పెద్ద కష్టం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News