Gold Rate Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధర..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 18 బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 74,880 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,640 రూపాయలు పలికింది. బంగారం ధర నిన్న 75 వేల రూపాయలు దాటింది అయినప్పటికీ నేడు స్వల్పంగా తగ్గి వచ్చింది.

Update: 2024-09-18 02:09 GMT

అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీ నేడు జరగనుంది. ఇందులో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకొని ఉన్నారు ఒకవేళ వడ్డీరేట్లను అందరూ ఊహించినట్లుగానే తగ్గిస్తే మాత్రం బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా బంగారం మార్కెట్లో ఒక ఔన్స్ పసిడి ధర 2600 డాలర్లు దాటింది. దీంతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే బంగారం ధరలు రాబోయే దసరా దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని పసిడి నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అని చెబుతున్నారు.

దీనికి తోడు దేశీయంగా కూడా ధన త్రయోదశి ఇలాంటి పండగల సందర్భంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయిని తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాల కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని పసిడి నిపుణులు పేర్కొంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుత రికార్డు స్థాయిలో ఉన్న ధరల వల్ల కొద్ది మొత్తంలో తేడా వచ్చిన కస్టమర్లు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా హాల్ మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం ఆభరణాల దుకాణాల్లో హాల్ మార్క్ బంగారాన్ని మాత్రమే విక్రయించాలని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మీరు ఎంత చిన్న నగపైన అయినా సరే హాల్ మార్క్ లేకపోతే మీరు వెంటనే తిరస్కరించవచ్చు అదే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News