Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

Gold Rate Today: బంగారం ధర ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదల వల్ల బంగారం ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నేటి బంగారం ధరల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ. 75050 పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,800 రూపాయలు పలుకుతోంది.

Update: 2024-09-17 01:57 GMT

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధానంగా అమెరికా డాలర్ పతనం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ విలువ ఏకంగా తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది దీంతో అంతర్జాతీయంగా బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు భేటీ రేపు జరగనుంది ఇందులో పావు శాతం మేర వడ్డీ రేట్లు చేస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి.

వీటన్నింటి నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సిడి ధర చాలా రోజుల తర్వాత మరోసారి 75000 మార్కును దాటింది. ఈ సంవత్సరం బంగారం ధర విపరీతంగా పెరిగింది. పసిడి ధరలు ప్రధానంగా పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక రాబోయే ఫెస్టివల్ సీజన్ దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి షాక్ అనే చెప్పవచ్చు.ఎందుకంటే పెరిగిన ధరల నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ఆభరణాల్లో కొనుగోలు చేస్తున్నప్పుడు కచ్చితంగా హాల్ మార్క్ బంగారం ఉందా లేదా అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే విక్రయించాలని తప్పనిసరి చేసింది. హాల్ మార్క్ లేనట్లయితే వెంటనే మీరు ఫిర్యాదు చేయవచ్చు. అయితే బంగారం ఆభరణాల విషయంలో తూకం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక గ్రాము తేడా వచ్చిన మీరు వేళల్లో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News