Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ తులం ధర ఎంతుందంటే?
Gold Rate Today: సెప్టెంబర్ 13 శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 73,140 రూపాయల వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,040 ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధరల హెచ్చుతగ్గులు కేవలం 100 రూపాయల లోపే ఉన్నాయి.
Gold Rate Today: సెప్టెంబర్ 13 శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 73,140 రూపాయల వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,040 ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధరల హెచ్చుతగ్గులు కేవలం 100 రూపాయల లోపే ఉన్నాయి.
బంగారం ధరలు గడచిన వారం రోజులుగా తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి అయితే ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి కన్నా రెండు వేల రూపాయల తక్కువలో ట్రేడ్ అవుతోంది గతంలో ఆల్ టైం గరిష్ట స్థాయి 75 వేల రూపాయల ఎగువన నమోదు అయింది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగుముఖం పడతాయా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో కలుగుతున్నాయి.
అయితే పలు అంతర్జాతీయ పరిణామాలు ఫలితంగా బంగారం ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర అమెరికా మార్కెట్లలో ప్రస్తుతం 2500 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు దేశీయంగా కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బంగారం ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోన అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లో తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు తమ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బంగారం ధరలు రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ నెలలోనే ఫెడరల్ రిజర్వ్ భేటీ కానుంది.
ఈ సందర్భంగా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం భారతదేశంలో కూడా పడి దేశీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మరో వైపు ధన త్రయోదశి ఇలాంటి పండగలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.