Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..తులంపై ఎంత పెరిగిదంటే?
Gold Rate Today: బంగారం ధరలు సెప్టెంబర్ 12 గురువారం భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,250 రూపాయలు పలుకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,150 రూపాయలు పలికింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం మరోసారి 2500 డాలర్ల మార్పును దాటాయి. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. మరోవైపు అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే అవకాశం ఉంది. దీంతో అటు ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది ఫలితంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి.
ఇక దేశీయంగా గమనించినట్లయితే, బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం. అతి త్వరలోనే దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. అంతేకాదు ధన త్రయోదశి కూడా ఈ సీజన్లోనే వస్తుంది. ఈ సందర్భంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే పసిడి ధరలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి దిశగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 75 వేల రూపాయల ఎగువన బంగారం ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. సాధారణంగా బంగారం ధరలు ఈ సీజన్లో పెరగడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు త్వరలోనే తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే బంగారం ధరలు అతి త్వరలోనే మన దేశంలో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉంటుంది.