Aadhar Card Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా.. నేటితో గడువు ముగింపు..!

Aadhaar Card: మనదేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. ఇది లేదంటే చాలా పనులు పెండింగ్లో పడుతాయి.

Update: 2024-09-14 01:48 GMT

Aadhar Card Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా.. నేటితో గడువు ముగింపు..!

Aadhaar Card: మనదేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. ఇది లేదంటే చాలా పనులు పెండింగ్లో పడుతాయి. ఇది పనిచేయకుంటే మీకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. ఆధార్ కార్డు లేకపోతే దేశంలో మీకు గుర్తింపు లేనట్టే. అయితే ఈ కార్డులో వివరాలు నమోదు చేసుకొన్నప్పుడు కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది. లేకపోతే వేరే ఊరు వలస వెళ్లిపోవచ్చు. పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉండవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం చాలా అవసరం. ఏ సమయంలో అయినా వీటిని సరిదిద్ధుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో తప్పులను ఉచితంగా సరిచేసుకోనే అవకాశం ఉంది. పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ అని ఉడాయ్‌ ప్రకటించింది. ఇందుకోసం వ్యక్తిగత గుర్తింపు, చిరునామా పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది.

ఉడాయ్‌ అధికార వెబ్‌సైట్‌ http://myaadhar.uidai.gov.inలో ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ సాయంతో లాగిన్‌ అయి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని చెప్పింది. సెప్టెంబర్‌ 14 తర్వాత మార్పులు చేసుకోవాలంటే రూ.50 జరిమానా చెల్లించాలని తెలిపింది. వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్స్‌, ముఖ చిత్రాల వంటి బయో మెట్రిక్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోలేరని తెలిపింది.

Also Read : Aadhar Card Update: ఫ్రీగా ఆధార్ కార్డు ఆన్‌లైన్లో అప్డేట్ చేసుకోండిలా... Step by Step Guide


Full View


Tags:    

Similar News