Gold Rate Today: మహిళలకు శుభవార్త..బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?

Gold Rate Today: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి సెప్టెంబర్ 10, మంగళవారం హైదరాబాదులో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

Update: 2024-09-10 00:27 GMT

Gold Rate Today: మహిళలకు శుభవార్త..బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?

Gold Rate Today: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 72870 రూపాయల వద్ద పలుకగా, 22 క్యారెట్ల విలువ 66,800 రూపాయల వద్ద నమోదు అయ్యింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 200 రూపాయలు పైగా తగ్గింది. నిన్న సోమవారం బంగారం ధర 73000 రూపాయల ఎగువన ఉంది. ప్రస్తుతం బంగారం ధరలో నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోసారి బంగారం ధర 73 వేల రూపాయల దిగువకు చేరింది.

ఇదిలా ఉంటే ఒకవైపు దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ అయినా శ్రావణమాసం ముగిసిపోయింది. దీంతో మరో సీజన్ కోసం బంగారం మార్కెట్ ఎదురుచూస్తోంది. అయితే త్వరలోనే దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ ఈ సీజన్లో దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బంగారం ప్రత్యేకంగా కొనుగోలు చేసే ధన త్రయోదశి కూడా దీపావళి ముందు తేదీ కన్నా ముందే ఉంది. అయితే బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా మాత్రం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికా జాబ్స్ డేటా అనుకున్న స్థాయిలో లేకపోవడం, దీనికి తోడు అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టడం వంటి పరిణామాలు చూస్తున్నాం. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని బంగారం వరకు తరలిస్తూ ఉంటారు. కాజాగా ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి.

దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల పై పెట్టుబడి పెట్టిన వారంతా వడ్డీరేట్లు తగ్గడంతో, సురక్షిత పెట్టుబడి సాధనంగా పిలవబడే బంగారం వైపు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలు గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలో ఉన్నాయి.

అయితే ఈ ధరలో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే ఎవరైతే బంగారంపై కేవలం ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారు బంగారు ఆభరణాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం సరైన పద్ధతి అని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News