బ్యాంకులను లోన్ల పేరుతొ కొల్లగొట్టారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యాపార వేత్త విజయమాల్య భారత్ కు తిరిగి రానున్నారు. ఈరోజు రాత్రి లండన్ నుంచి విజయ్ మాల్యను ముంబాయి తీసుకువస్తున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ IANS వెల్లడించింది. ముంబాయి లో విజయ్ మాల్య ను సీబీఐ ఆఫీసులో విచారించే అవకాశం ఉంది.
ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా కచ్చితమైన సమాచారం రాలేదు.
వివిధ రకాలైన బ్యాంకుల నుంచి దాదాపు 9 వేల కోట్ల వరకూ లోన్ల రూపంలో నిధులు తీసుకుని చెల్లించకుండా తప్పించుకుపోయరనేది విజయమాల్యా పై ప్రధాన ఆరోపణ.
అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో 2016 మార్చి 2 న విజయ్ మాల్యా విదేశాలకు వెళ్ళిపోయారు. 2019 జనవరిలో ఆయనను ఉద్దేశ్యపూర్వక అప్పుల ఎగవేతదారు ప్రకటించారు.
విజయ మాల్యా భారత్ రాకుండా లండన్ కోర్టులను ఆశ్రయించారు. అయితే, ఆయన నేరం పై భారత వాదనలు విన్న లండన్ న్యాయస్థానం 2018 ఆగస్టులో విజయ మాల్యాను భారత్ లో ఏ జైలులో ఉంచుతారనే వివరాలు చెప్పాలని కోరింది. అప్పుడు ముంబాయి ఆర్థర్ రోడ్డు జైలు లో ఉన్న ఒక సెల్ వీడియో తీసి కోర్టుకు సమర్పించారు భారత్ అధికారులు. ఇప్పుడు విజయ మాల్యా తిరిగి వచ్చిన వెంటనే ఆయనను అదే జిలో ఉంచే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి