భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Update: 2021-01-22 11:41 GMT

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో వారాంతాన బలహీనంగా ప్రారంభమైన సూచీలు అంతకంతకూ దిగజారాయి. మెటల్స్, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను భారీ నష్టాల దిశగా నడిపించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ సైతం 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సూచీలు మరింతగా నష్టాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 746 పాయింట్లు దిగజారి 48,878 వద్ద, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 14,371 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News