Fixed Depositors: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి బంపర్ ఆఫర్.. ఇక్కడ సుకన్య సమృద్ధి, ఈపీఎఫ్‌ కంటే అధిక వడ్డీ..!

Fixed Depositors: చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును మంచి స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలని కోరుకుంటారు. ఇందుకోసం అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులను ఎంచుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు.

Update: 2024-05-09 13:30 GMT

Fixed Depositors: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి బంపర్ ఆఫర్.. ఇక్కడ సుకన్య సమృద్ధి, ఈపీఎఫ్‌ కంటే అధిక వడ్డీ..!

Fixed Depositors: చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును మంచి స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలని కోరుకుంటారు. ఇందుకోసం అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులను ఎంచుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. దీనివల్ల వారికి వడ్డీతో పాటు అసలు మొత్తం కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు తక్కువ, మరికొన్ని ఎక్కువ వడ్డీ చెల్లిస్తాయి. ఇటీవల రెపోరేటు 6.5 శాతానికి చేరుకున్న తర్వాత చాలా బ్యాంకులు ఎఫ్‌డిపై మంచి రాబడిని అందిస్తున్నాయి. యూనిటీ, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ కస్టమర్లకు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, సుకన్య సమృద్ధి స్కీమ్‌లలో కూడా ఇంత వడ్డీ చెల్లించడం లేదు.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4.5% నుంచి 9% మధ్య వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 9.5% వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ 1001 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వర్తిస్తుంది. కానీ సాధారణ పెట్టుబడిదారులకు ఈ వడ్డీ 9%గా ఉంది. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5% నుంచి 9.5% వరకు వడ్డీ రేట్లు పొందుతున్నారు.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై సాధారణ కస్టమర్లకు 4% నుంచి 9.1% మధ్య వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5% నుంచి 9.6% వరకు వడ్డీని పొందుతున్నారు. ఐదేళ్ల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 9.1% అందిస్తున్నారు. సాధారణ కస్టమర్లు 5 సంవత్సరాల డిపాజిట్లపై 9.10% వడ్డీ రేటును పొందవచ్చని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు 0.5 శాతం ఎక్కువ అంటే 9.60% చెల్లిస్తారు.

Tags:    

Similar News