Bank Holidays In April 2024: ఏప్రిల్‌లో 14 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితాను చెక్ చేయండి..!

Bank Holidays In April 2024: 2023 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది.

Update: 2024-03-31 12:30 GMT

Bank Holidays In April 2024: ఏప్రిల్‌లో 14 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితాను చెక్ చేయండి..!

Bank Holidays In April 2024: 2023 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. ఈ నెలలో శ్రీరామనవమి, ఈద్ పండుగలు వస్తున్నాయి. ఏప్రిల్‌కు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఏప్రిల్‌లో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఇందులో శని, ఆదివారం కూడా ఉంటాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళ్లాలంటే ఈ సెలవుల జాబితాను ఒకసారి చెక్‌చేసుకొని వెళ్లండి. మీ పని సులభమవుతుంది.

ఏప్రిల్‌లో బ్యాంకు సెలవులు

1 ఏప్రిల్ 2024: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అగర్తల, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కొహిమా, లక్నో, ముంబయిలో బ్యాంకులకు సెలవుదినం.

5 ఏప్రిల్ 2024: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమ్మత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ, జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు క్లోజ్‌ అయి ఉంటాయి.

9 ఏప్రిల్ 2024: గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సరం, మొదటి నవరాత్రి సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

10 ఏప్రిల్ 2024: ఈద్ కారణంగా కొచ్చి,కేరళలో బ్యాంకులకు సెలవుదినం.

11 ఏప్రిల్ 2024: ఈద్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులకు సెలవుదినం. అయితే చండీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులు తెరిచి ఉంటాయి.

15 ఏప్రిల్ 2024: హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లా బ్యాంకులు మూసివేస్తారు.

17 ఏప్రిల్ 2024: శ్రీరామ నవమి సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవుదినం.

20 ఏప్రిల్ 2024: గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవుదినం.

ప్రతి నెలా ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవుదినం. ఏప్రిల్‌లో దేశంలోని అన్ని బ్యాంకులు ఏప్రిల్ 7 (ఆదివారం), 13 ఏప్రిల్ (రెండవ శనివారం), 14 ఏప్రిల్ (ఆదివారం), 21 ఏప్రిల్ (ఆదివారం), ఏప్రిల్ 27 (నాలుగో శనివారం), 28 ఏప్రిల్ (ఆదివారం) సెలవుదినాలు.

Tags:    

Similar News