Bank Holiday July 2023: జూలైలో సగం రోజులు బ్యాంకులకి సెలవులే.. ఒక్కసారి లిస్టు చెక్ చేయండి..!
Bank Holiday July 2023: మరికొన్ని రోజుల్లో జూన్ పూర్తై జూలై ప్రారంభమవుతుంది.
Bank Holiday July 2023: మరికొన్ని రోజుల్లో జూన్ పూర్తై జూలై ప్రారంభమవుతుంది. వచ్చే నెలలో ఏకంగా సగం రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకి కలిపి దాదాపు 15 రోజుల సెలవులు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం 8 రాష్ట్ర సెలవులు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాలకి వివిధ రోజులలో ఉంటాయి. బ్యాంకులలో అత్యవసర పనులు ఉన్నవారు ఒక్కసారి సెలవుల లిస్టుని చూసుకొని వెళ్లడం ఉత్తమం.
మొహర్రం కారణంగా
జూలై 29న మొహర్రం పండుగ ఉంది. ఈ రోజున చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మొహర్రం కారణంగా త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బ్యాంకులు సెలవు ఉంటుంది. స్థానిక పండుగలను దృష్టిలో ఉంచుకుని సెలవులని నిర్ణయిస్తారు. బ్యాంకులో ఏదైనా పని ఉంటే వీలైనంత త్వరగా చేసుకోవడం మంచిది. కానీ ATM, నగదు డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటివి ఇంటి నుంచే డిజిటల్‌గా చేసుకోవచ్చు. అయితే రూ.2,000 బ్యాంకు నోట్లను మార్చుకునే ముందు సెలవుల జాబితాను తనిఖీ చేయాలి. చివరితేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు.
సెలవుల లిస్టు
జూలై 2న ఆదివారం
జూలై 5వ తేదీ గురు హరగోవింద్ జీ జయంతి
జూలై 6వ తేదీ MHIP డే కారణంగా మిజోరంలో సెలవు
జూలై 8వ తేదీ రెండవ శనివారం
జూలై 9వ తేదీ ఆదివారం
జూలై 9వ తేదీ కేర్ పూజ కారణంగా త్రిపురలో సెలవు
జూలై 13 భాను జయంతి సిక్కింలో సెలవు
జూలై 16వ తేదీ ఆదివారం
జూలై 17న మేఘాలయలో యు టిరోట్ సింగ్
జూలై 21వ తేదీన సిక్కింలో సెలవుదినం
జూలై 22 నాలుగవ శనివారము
జూలై 23 ఆదివారం
జూలై 28వ తేదీ అషురా జమ్మూ మరియు శ్రీనగర్ కారణంగా సెలవు
జూలై 29న మొహర్రం సెలవు