కొన్ని సంత్సరాల కిందట హమారా బజాజ్, హమారా చేతక్ అనే ఒక ప్రకటనను అందరూ వినే ఉంటారు. అప్పటి కాలంలో స్కూటర్ల రాజ్యంలోనే బజాజ్ చేతక్ ఒక ఊపు ఊపింది. కానీ కాలానుగుణంగా కొత్త మోడల్ లో ద్విచక్ర వాహణాలు రావడంతో బజాజ్ చేతక్ కనుమరుగైంది.
ఇప్పుడు బజాజ్ కంపెనీ భారతీయులకు సంక్రాంతి కానుకను ఇవ్వటానికి చేతక్ ను మంగళవారం భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. మారిన కాలానికి అనుగుణంగా కొత్త హంగులతో దీన్ని రూపొందించిన వాహనాన్ని కంపెనీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ టూవీలర్ ని ఈ సారి ఎలక్ట్రిక్ వెర్షన్ లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు అది దాదాపుగా 85 కిలో మీటర్ల నుంచి 95 కిలో మీటర్లవరకు ప్రయాణిస్తుంది. ఇది ఫుల్ గా చార్జింగ్ ఎక్కడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక ఈ చేతక్ ఎలక్ట్రిక్ వాహనం ధరను రూ.1లక్ష(ఎక్స్ షోరూం పుణె, బెంగళూరు)గా నిర్ణయించారు. దాంతో పాటు అర్బన్ వేరియంట్ ధర రూ.లక్ష నిర్ణయించగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.15లక్షలుగా నిర్ణయించారు.
ఇక దీని బాడీని చూసుకున్నట్లయితే ఇంతకు ముందులాగా ప్లాస్టి్క్ బాడీ కాకుండా మెటల్ బాడీతో తయారు చేయడం విశేషం. మహారాష్ట్రలోని చకన్ కర్మాగారంలో 2019 సెప్టెంబరు 15 నుంచి చేతక్ తయారీని నిర్వహించినట్లు బజాజ్ ఎండీ రాజీవ్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీనికి మూడు సంవత్సరాల వారెంటీ, మూడు ఉచిత సర్వీసులను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచే ఈ వాహనం బుకింగ్స్‌ను స్తారంభించనున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల నుంచి వాహనాలను డెలివరీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్ లను పుణె, బెంగళూరులో మాత్రమే దీన్ని విడుదల చేశామని, రానున్న కాలంలో అన్ని రాష్ట్రాల్లో వీటిని విడుదల చేసామని వారు స్పష్టం చేసారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే బజాజ్ ను బుక్ చేసుకోండి.