ATM Scam: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.. కొత్త స్కాం గురించి తెలుసుకోపోతే నష్టపోతారు..!

ATM New Scam: ఆధునిక కాలంలో పెరిగిన టెక్నాలజీ వల్ల లాభమా, నష్టమా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-05-03 12:00 GMT

ATM New Scam: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.. కొత్త స్కాం గురించి తెలుసుకోపోతే నష్టపోతారు..!

ATM New Scam: ఆధునిక కాలంలో పెరిగిన టెక్నాలజీ వల్ల లాభమా, నష్టమా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకో కొత్త స్కాం వెలుగులోకి వస్తుంది. ఓ వైపు సైబర్‌ నేరస్థులు పర్సనల్‌ వివరాలు తెలుసుకొని డబ్బులు దోచేస్తుంటే మరోవైపు ఇంకొంత మంది ఫ్రాడ్‌గాళ్లు ఏటీఎంలను టార్గెట్‌ చేస్తున్నారు. కస్టమర్లను ఆగంజేసి తెలివిగా డబ్బులు దొబ్బేస్తున్నారు. తాజాగా మెట్రో సిటీల్లో కొత్త రకం ఏటీఎం చోరీలు జరుగుతున్నాయి. అలర్ట్‌గా లేకుంటే ఉన్న డబ్బులు కోల్పోతారు. ఈ రోజు ఆ స్కాం గురించి తెలుసుకుందాం.

కొంతమంది దుండగులు ఏటీఎం మెషీన్‌ కార్డు రీడర్‌ను ట్యాంపర్‌ చేసి ఈ మోసాలకు పాల్పడు తున్నారు. ఈ ఘటనలు ఎక్కువవుతుండటంతో బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. దిల్లీలో ఇటీవల పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈతరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దుండగులు తొలుత సెక్యూరిటీ గార్డుల్లేని ఏటీఎంలను గుర్తిస్తారు. లోపలికి వెళ్లి సీసీటీవీలపై రంగు స్ప్రే చేస్తారు. నెమ్మదిగా మెషీన్‌లోని కార్డ్‌ రీడర్‌ను తొలగిస్తారు. కస్టమర్‌ వచ్చి కార్డు పెట్టగానే అది దాంట్లో ఇరుక్కుపోతుంది.

వెంటనే మోసగాళ్లు రంగంలోకి దిగుతారు. సాయం చేస్తామని నమ్మిస్తారు. పిన్‌ ఎంటర్‌ చేయమని చెబుతారు. అలా ఎన్నిసార్లు పిన్‌ ఎంటర్‌ చేసినా కార్డు రాకపోవటంతో బ్యాంకును సంప్రదించమ ని సలహా ఇచ్చి అక్కడినుంచి జారుకుంటారు. కస్టమర్‌ వెళ్లిపోగానే మళ్లీ అక్కడకు వచ్చి కార్డు తీసుకుంటారు. మరో ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటారు. అందుకే జన సంచారం అంతగా లేని ప్రాంతాల్లోని ఏటీఎంలకు ఒంటరిగా వెళ్లొద్దు. రాత్రిపూట వెలుతురు ఉన్న ఏటీఎంలలోనే లావాదేవీలు చేయడం ఉత్తమం.

Tags:    

Similar News