Instant Loans Rules: ఇన్స్టంట్ లోన్స్ తీసుకుంటున్నారా.. ముందుస్తుగా ఈ విషయాలు గమనించండి..!
Instant Loans Rules: ఈ రోజుల్లో లోన్ కావాలంటే ముందుగా అందరూ చేసే పని ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్స్ కోసం వెతకడం.
Instant Loans Rules: ఈ రోజుల్లో లోన్ కావాలంటే ముందుగా అందరూ చేసే పని ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్స్ కోసం వెతకడం. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సులువుగా లోన్లు లభిస్తున్నాయి. గతంలో మాదిరి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దీనివల్ల చాలా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇన్స్టంట్ లోన్ కంపెనీల రూల్స్ తెలియకుండా లోన్ తీసుకొని తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి లోన్స్ తీసుకునే మందు కొన్ని విషయాలను గమనించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఇన్స్టంట్ లోన్ కోసం తీసుకునే మందు ఆయా కంపెనీల కస్టమర్ రేటింగ్ చూడాలి. ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిశీలించాలి. వాటిని ఇతర కంపెనీలతో పోల్చి చూడాలి. తర్వాతే లోన్ గురించి ఆలోచించాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే వడ్డీరేట్లు. ఇన్స్టంట్ లోన్లపై కంపెనీలు వడ్డీ అధికంగా వసూలు చేస్తాయి. వీటితో పాటు లేట్ పేమెంట్ ఫీజు, ప్రీ పేమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ రుసుముల విధిస్తారు. వీటన్నిటి గురించి ముందుగానే తెలుసుకొని ఆ లోన్ తీసుకోవడానికి మనం సెట్ అవుతామో లేదో ఆలోచించుకొని తీసుకోవాలి.
కొన్ని కంపెనీలు తమకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాచిపెట్టి కస్టమర్లను బురిడి కొట్టిస్తాయి. అధిక వడ్డీలకు లోన్లు అంటగట్టి తర్వాత చెల్లింపుల కోసం పట్టి పీడిస్తాయి. అందుకే అలాంటి కంపెనీల గురించి కొంత రీసెర్చ్ చేయాలి. ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైనా తారుమారవుతాయి.
ఇలాంటి సందర్భంలో ఈ లోన్లు తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుందా లేదా అనే విషయం గమనించాలి. అలాగే లోన్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని మెస్సేజెస్ లేదా ఈ మెయిల్ ద్వారా కస్టమర్‌కు తెలియజేయాలి. దీనివల్ల వారు అలర్ట్‌గా ఉండే అవకాశం ఉంది. అన్నిటి కంటే ముఖ్య విషయం ఏంటంటే సులువుగా లోన్ ఇస్తున్నారు కదా అని అవసరం లేకున్నా ఎక్కువగా తీసుకొని ఇబ్బంది పడవద్దు. ఎంత అవసరమో అంతే తీసుకొని సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్‌లో మీకు మళ్లీ లోన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.