Insurance New Rules: ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారా.. ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనల్లో మార్పులు..!

Insurance New Rules: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అయినా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అయినా జీవితానికి ఒక భరోసా కల్పిస్తుంది. వీటివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా సురక్షితంగా ఉంటున్నాయి.

Update: 2024-03-31 16:00 GMT

Insurance New Rules: ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారా.. ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనల్లో మార్పులు..!

Insurance New Rules: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అయినా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అయినా జీవితానికి ఒక భరోసా కల్పిస్తుంది. వీటివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా సురక్షితంగా ఉంటున్నా యి. ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. భారతదేశం లో ఇన్సూరెన్స్‌ పాలసీలను ఐఆర్‌డీఏఐ నియంత్రిస్తుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఇందులో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కొద్ది రోజుల క్రితం ఐఆర్‌డీఏ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఇక నుంచి ఏ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకున్నా పాలసీదారులు దానిని ఎలక్ట్రానిక్ అంటే డీమ్యాట్ రూపంలో తప్పనిసరిగా ఉంచుకోవాలి. బీమా కంపెనీ దీనిని రెండు రకాల ఇ-ఇన్సూరెన్స్ ఫారమ్‌లలో జారీ చేస్తుంది. అయినప్పటికీ కస్టమర్ ఫిజికల్ పాలసీని పొందే అవకాశం ఉంటుంది. ప్రజలు తమ షేర్లను నిర్వహించే విధంగానే ఇ-ఇన్సూరెన్స్ పాలసీలను వాడుకోవచ్చు.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బీమా దరఖాస్తును ఐఆర్‌డీఏఐ ఏ రూపంలో స్వీకరించినా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో పాలసీని జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నియమం ఏప్రిల్ 1, 2024 నుంచి తప్పనిసరి కానుంది. దీని కోసం బీమా కంపెనీలు తప్పనిసరిగా ఇ-పాలసీతో పాటు ఫిజికల్ పాలసీ ఆప్షన్‌ ఇవ్వాలి. ఇ-ఇన్సూరెన్స్ పాలసీని నిర్వహించడానికి ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది. దీని వల్ల మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. ముందుగా మీరు మీ పాలసీ పత్రాలను ఎక్కువ కాలం భద్రపరచాల్సిన అవసరం లేదు. దీనివల్ల పేపర్ వర్క్ భారం ఇబ్బందులు తగ్గుతాయి.

ఇది మాత్రమే కాదు ఆన్‌లైన్‌లో బీమా తీసుకున్నప్పటికీ కస్టమర్‌లు తమ వేర్వేరు పాలసీలను సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇ-ఇన్సూరెన్స్ ఖాతాలో ఒకే చోట ఉంచవచ్చు. ఈ ఖాతా బీమా కంపెనీలు పాలసీ హోల్డర్‌ల మధ్య వారధిగా పనిచేస్తుంది. మీరు ఈ ఖాతాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా మార్చినట్లయితే అది మీ బీమా పాలసీలన్నింటిలో దానికదే అప్‌డేట్‌ అవుతుంది. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఓపెన్‌ చేయడం చాలా సులభం ఉచితం కూడా.

Tags:    

Similar News