SIP Planning: సిప్ స్టార్ట్ చేస్తున్నారా.. కోటీశ్వరులవుతారని గ్యారెంటీ ఉందా..!
SIP Planning: సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. చాలామంది సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
SIP Planning: సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. చాలామంది సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కారణం పబ్లిసిటి పెరగడమే. సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కోటీశ్వరులు కావొచ్చు కానీ అన్నిసార్లు ఇది జరగదు. ఎందుకంటే ఇది మార్కెట్ రిస్క్లకి లోబడి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని దాచి కేవలం లాభాల గురించి మాత్రమే ప్రచారం చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అంటేనే రిస్క్. అయితే ఇటీవల కాలంలో వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే సిప్ ద్వారా సంపద పెంచుకునే మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఎలా పెట్టుబడి పెట్టాలి..?
చాలామందికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు. దీనికోసం మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. దీనివల్ల ఒక్కోసారి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే సరైన ఫండ్‌ను ఎంచుకోవడం మాత్రమే కాదు. అందులో పెట్టుబడి ఎలా పెట్టాలో కూడా తెలుసుకోవాలి.
సిప్ చేయడానికి కారణం ఉండాలి
మీరు సిప్‌లో పెట్టుబడి పెడుతున్నారంటే ఒక లక్ష్యంతో ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే దీర్ఘకాలంగా కొనసాగించలేరు. రిటైర్మెంట్ ప్లాన్, ఇల్లు కొనడం, పిల్లల పెళ్లి, చదువు, ఇలా ఏదో టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. దీనివల్ల మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఎందులో చేయకూడదో తెలుస్తుంది.
ఖర్చులు, పొదుపులు అంచనా వేయాలి
కొంతమంది సిప్ చేయడం వల్ల కోటీశ్వరులు కావొచ్చని ఆదాయం లేకున్నా స్టార్ట్ చేస్తారు. రెండు మూడు నెలలు కట్టి వదిలేస్తారు. ఇలాంటి వారికి ఇది సెట్ అవదు. ప్రతి నెలా ఆదాయం వచ్చేవారు సిప్ చేయాలి. వారుకూడా నెలవారీ బడ్జెట్ వేసుకొని డబ్బులు మిగిలితేనే వాటిని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఉద్యోగం పోయినా వ్యాపారం దెబ్బతిన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
దీర్ఘకాలికంగా పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఒక ప్రాసెస్. త్వరగా ధనవంతులు అవుతారని అనుకోవద్దు. దీనిపై మార్కెట్ ఒత్తిడి ఉంటుంది. హెచ్చు తగ్గులు ఉంటాయి. అన్నిటికి ఓర్చుకొని నిలబడితేనే చివరకు మీరు అనుకున్నది సాధిస్తారు. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గించి అధిక రాబడిని సాధించవచ్చు. ఇందుకోసం సరైన ఫండ్న ఎంచుకోవడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోండి.