Buying Home Plan: ఇల్లు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!

Buying Home Plan: 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. అంటే ఈ రెండు పనులు ఎంత కష్టమైనవో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి.

Update: 2024-02-25 14:30 GMT

Buying Home Plan: ఇల్లు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!

Buying Home Plan: 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. అంటే ఈ రెండు పనులు ఎంత కష్టమైనవో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. నేటి రోజుల్లో సొంతింటి కల చాలా మందికి ఉంది కానీ దీనిని సాధించడం చాలా కష్టం. దీనికి పక్కా ప్లాన్​, ఓర్పు, సహనం అవసరమవుతాయి. ఇల్లు నిర్మించడానికైనా, కొనడానికైనా ముందుగా బడ్జెట్​ గురించి ఆలోచించాలి. లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మీరు నెలకి ఎంత సంపాదిస్తారు ఎంత మిగులుస్తారు అనే విషయం ముందుగా లెక్కలోకి తీసుకోవాలి. మీరు చేసే పొదుపుతో ఈఎంఐ చెల్లించవచ్చా లేదా అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకొని ముందుకు వెళ్లాలి. దీనితో పాటు మరికొన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్​ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు పనిచేసే కంపెనీలు మీకు అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోవాలి. మీ పిల్లల స్కూల్స్​, కాలేజీలు దగ్గర్లో ఉన్నాయా లేదా చూడాలి. మీ ఇల్లుకి ఎల్లప్పుడు డిమాండ్ ఉండాలంటే మంచి సెంటర్​లో తీసుకోవాలి లేదా నిర్మించాలి. ఇలాంటి ప్రయారీటీలను గమనించి ఇంటి కలను నెరవేర్చుకోవాలి. అలాగే మీరు నిర్మించడం కాకుండా కొనేవారైతే నెలకి బాగా సంపాదించే వారై ఉండాలి. లేదంటే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగాలు చేస్తే మీకు సహకరించే విధంగా ఉండాలి. దీనివల్ల ఈఎంఐ కట్టడం సులువుగా ఉంటుంది. ఒక్కరిపై భారం పడకుండా బ్యాంకు లోన్​ సులువుగా తీర్చేయవచ్చు.

హోమ్​లోన్​ తీసుకునేటప్పుడు లోన్​ మొత్తంలో 20% డౌన్‌ పేమెంట్‌ మీ వద్ద ఉండాలని గుర్తుంచుకోండి. లేదంటే కొన్నిసార్లు లోన్​ మంజూరు కాకపోవచ్చు. ఒకవేళ బలవంతంగా తీసుకున్నా ఈఎంఐ, వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అలాగే అడిషనల్​ ఛార్జీలు, ఇంటీరియర్‌లకు అయ్యే ఖర్చులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అంతర్గత సంబంధిత ఖర్చులు లెక్కలోనికి తీసుకోవాలి. అలాగే ఇంటిపై పెట్టుబడి పెట్టడానికి ముందు రీసేల్‌ విలువను తెలుసుకోవాలి. చాలా మంది ఇంటిని తీసుకునేటప్పుడు రీసేల్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఇల్లు అనేది ఉండడానికే కదా అని లైట్​ తీసుకుంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఆర్థిక వనరుగా కూడా అవసరమవుతుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News