Income Tax: ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇన్‌కం టాక్స్ నుంచి నోటీసులు అందుకునే ఛాన్స్..!
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ పెట్టుబడులన్నింటి గురించి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఐటీఆర్‌లో తప్పుడు సమాచారం ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. దాని వల్ల వారికి సమస్యలు తలెత్తుతాయి.
ITR Filing: ప్రతి సంవత్సరం ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైలు చేస్తుంటారు. ITR సరిగ్గా పూరిస్తే టాక్స్ నుంచి మినహాయింపు పొందుతారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్దపీట వేస్తారు. ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు పన్ను చెల్లింపుదారులు అనేక పద్ధతులను అనుసరిస్తారు. పన్ను మినహాయింపు కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది.
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు, పన్ను చెల్లింపుదారులు తమ పెట్టుబడుల గురించి చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఐటీఆర్‌లో తప్పుడు సమాచారం ఇచ్చేవారు చాలా మందే ఉన్నారు. దాని వల్ల వారికి సమస్యలు తలెత్తుతాయి. తప్పుడు సమాచారం ఇచ్చిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను వివిధ చట్టాల కింద నోటీసులు పంపవచ్చు. కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా నోటీసులను నుంచి అలాగే టాక్స్ నుంచి తప్పించుకోవచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేయడం లేదు..
ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు కూడా పంపుతుంది. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఉన్న వ్యక్తులు ఐటీఆర్ నింపడం తప్పనిసరి. భారతీయ పౌరుడు అయినప్పటికీ, మీకు విదేశాల్లో ఆస్తులు ఉన్నప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. ఇన్‌కమ్ ట్యాక్స్ నోట్ నింపకపోతే ఇంటికి నోటీసులు రావోచ్చు.
TDSలో తప్పులు..
TDS నింపేటప్పుడు కూడా చాలా సార్లు తప్పులు చేస్తుంటారు. జమ చేసిన టీడీఎస్‌కు, టీడీఎస్‌కు జమ చేసిన వాటికి తేడా ఉన్నా నోటీసులు రావొచ్చు. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే ముందు టీడీఎస్ ఎంత కట్ అవుతుందో తెలుసుకోవాలి.
వెల్లడించని ఆదాయం..
ఐటీఆర్‌లో మీరు ఆర్థిక సంవత్సరంలో ఎంత సంపాదిస్తారో చెప్పాల్సి ఉంటుంది. ఇది కాకుండా పెట్టుబడిని కూడా తప్పక చెప్పాలి. మీరు పెట్టుబడి ద్వారా సంపాదించి, దానిని బహిర్గతం చేయకపోతే, ఆ సందర్భంలో కూడా ఆదాయపు పన్ను ఆఫీసు నుంచి నోటీసులు రావొచ్చు. దీన్ని నివారించడానికి, మీరు బ్యాంకు నుంచి వడ్డీ స్టేట్‌మెంట్‌ను పొంది ఐటీఆర్‌లో ఉంచవచ్చు. ఇది కాకుండా, మీరు ఇతర వనరుల నుంచి పొందుతున్న ఆదాయం గురించి కూడా తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి.
ITRలో తప్పులు..
చాలా సార్లు ప్రజలు ITR నింపేటప్పుడు తొందరపడి తప్పులు చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాలను పూరించడం మర్చిపోతుంటారు. ఇటువంటి పరిస్థితిలో కూడా నోటీసులు రావొచ్చు.
అధిక విలువ లావాదేవీలు..
మీరు మీ సాధారణ లావాదేవీకి భిన్నంగా భారీగా లావాదేవీలు చేస్తే, నోటీసులు అందుకునే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు, మీ ఆదాయం రూ. 5 లక్షలు, ఒక సంవత్సరంలో మీ ఖాతాలో రూ. 12 లక్షలు జమ అయినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ దానిని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడగవచ్చు.