EPFO Rules: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. డబ్బులు ఎన్ని రోజుల్లో జమవుతాయి..!
EPFO Rules: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. డబ్బులు ఎన్ని రోజుల్లో జమవుతాయి..!
EPFO Rules: పిఎఫ్ ఖాతా ఉద్యోగ విరమణకు సిద్ధమయ్యే ప్రజలకు పెట్టుబడి, పొదుపుకు మంచి సాధనం. కానీ ఉద్యోగం సమయంలో మీకు డబ్బు అవసరమైతే ఏదో ఒక సమయంలో ఉపసంహరించుకోవచ్చు. తరచుగా ప్రజలు ఇల్లు నిర్మించడానికి లేదా వైద్య అత్యవసర ప్రాతిపదికన డబ్బును ఉపసంహరించుకుంటారు. అయితే దరఖాస్తు చేసిన తరువాత ఖాతాలో ఎన్ని రోజులకు డబ్బు జమవుతుందో తెలుసుకుందాం. అలాగే పిఎఫ్‌లో డబ్బు జమ అయినప్పుడు ఏ ప్రాతిపదికన వడ్డీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దానిని లెక్కించడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది. దీని ఆధారంగా పిఎఫ్‌లో జమ చేసిన డబ్బుపై వడ్డీ లభిస్తుంది. మీరు కూడా డబ్బు ఉపసంహరించుకోబోతున్నట్లయితే ఏ ప్రాతిపదికన వడ్డీ వస్తుందో తెలుసుకోండి.
ఎన్ని రోజుల్లో డబ్బు వస్తుంది?
తరచుగా ప్రజలు ఉద్యోగ విరమణకు ముందు లేదా ఉద్యోగం సమయంలో వారి పిఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకుంటారు. అటువంటి పరిస్థితిలో దరఖాస్తు చేసుకుంటే మీ దావా 20 రోజుల్లో ప్రాసెస్ చేయబడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అనేక నియమాలు మార్చబడ్డాయి. కరోనా వైరస్‌కు సంబంధించిన షరతుల కారణంగా మీరు పిఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకుంటే 7 రోజుల్లో లేదా 3 రోజుల్లో కూడా ఖాతాలో డబ్బు జమవుతుంది.
వడ్డీ ఎలా లెక్కించబడుతుంది?
ప్రతి నెల ఇపిఎఫ్ ఖాతాలో జమ చేసిన నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కించబడుతుంది. అయితే ఇది సంవత్సరం చివరన ఖాతాలో జమ చేయబడుతుంది. ఇపిఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక చివరి తేదీ నాటికి బ్యాలెన్స్ మొత్తం నుంచి ఏదైనా మొత్తాన్ని ఉపసంహరించుకుంటే 12 నెలల వడ్డీ తగ్గించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే వడ్డీ మొత్తాన్ని సంవత్సరం ప్రారంభం నుంచి ఉపసంహరణకు ముందు నెల వరకు వసూలు చేస్తారు.
మీకు ఎంతకాలం వడ్డీ వస్తుంది?
EPFO ఇచ్చిన సమాచారం ప్రకారం.. మీరు మీ ఖాతాను మూసేవరకు మీకు వడ్డీ లభిస్తుంది. కానీ ఇందులో చాలా షరతులు ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఉద్యోగ విరమణ వరకు మీ పిఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేశారని అనుకుందాం విరమణ తర్వాత కూడా మీరు ఆ డబ్బును ఉపసంహరించుకోకపోతే మీకు వడ్డీ లభిస్తుంది. అయితే మూడు సంవత్సరాలలో ఖాతా క్లోజ్ చేయకపోతే వడ్డీ లభిస్తుంది. కానీ మూడు సంవత్సరాల తరువాత మీ ఖాతా నిష్క్రియం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉద్యోగ విరమణ తరువాత పిఎఫ్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం సరైన ఎంపిక.