LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్ చేశారా..!
LPG Subsidy: పెరుగుతున్న పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ ధరల నుంచి ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఉపశమనం ఇచ్చింది.
LPG Subsidy: పెరుగుతున్న పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ ధరల నుంచి ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఉపశమనం ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పాటు ఎల్‌పీజీపై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. మీ ఖాతాలో సబ్సిడీ వస్తుందా లేదా అనేది ఇంట్లో కూర్చొని సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ ఖాతాలో సబ్సిడీని తనిఖీ చేయండి
1. ముందుగా www.mylpg.in ఓపెన్ చేయండి .
2. ఇప్పుడు మీరు స్క్రీన్ కుడి వైపున గ్యాస్ కంపెనీల గ్యాస్ సిలిండర్ల ఫోటోను చూస్తారు.
3. ఇక్కడ మీరు మీ సర్వీస్ ప్రొవైడర్ గ్యాస్ సిలిండర్ ఫోటోపై క్లిక్ చేయండి.
4. తర్వాత మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్‌కి చెందిన కొత్త విండో స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
5. ఇప్పుడు కుడి ఎగువన సైన్-ఇన్ , కొత్త వినియోగదారు ఎంపికపై నొక్కండి.
6. మీరు ఇప్పటికే మీ IDని ఇక్కడ క్రియేట్ చేసి ఉంటే, సైన్-ఇన్ చేయండి. మీకు ID లేకపోతే కొత్త వినియోగదారుని ఆప్షన్‌పై నొక్కడం ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ చేయవచ్చు.
7. ఇప్పుడు మీ ముందు ఒక విండో ఓపెన్ అవుతుంది. కుడి వైపున ఉన్న వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై నొక్కండి.
8. ఇక్కడ మీకు ఏ సిలిండర్‌కు సబ్సిడీ ఇవ్వబడింది, ఎప్పుడు అందించబడింది అనే సమాచారం లభిస్తుంది.
9. దీంతో పాటు మీరు గ్యాస్ బుక్ చేసి, మీకు సబ్సిడీ డబ్బు అందకపోతే, మీరు ఫీడ్‌బ్యాక్ బటన్‌పై క్లిక్ చేయవచ్చు.
10. ఇప్పుడు మీరు సబ్సిడీ డబ్బు అందకపోవడంపై ఫిర్యాదు చేయవచ్చు.
11. ఇది కాకుండా మీరు ఉచితంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
సబ్సిడీ ఎందుకు ఆగిపోతుందంటే..
మీకు సబ్సిడీ రాకపోతే ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడం ముఖ్యం. LPGపై సబ్సిడీ నిలిపివేయడానికి అతిపెద్ద కారణం LPG ఆధార్ లింక్ చేయకపోవడం. అలాగే వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు సబ్సిడీ ఇవ్వరు.
Also Read
Alert: గ్యాస్ కస్టమర్లకి అలర్ట్.. వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు..!