ఈ కంపెనీ ఉద్యోగులకి శుభవార్త.. జీవితాంతం ఇంటి నుంచే పని..!
ఈ కంపెనీ ఉద్యోగులకి శుభవార్త.. జీవితాంతం ఇంటి నుంచే పని..!
Airbnb Inc Employees: కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే సంస్కృతి బాగా పెరిగింది. దాదాపు చాలా కంపెనీలు ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని కంపెనీలు ఉద్యోగులని కార్యాలయాలకి పిలుస్తున్నాయి. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. లైఫ్‌టైమ్ ఇంటి నుంచి పనిచేయవచ్చని తెలిపింది. ఆ కంపెనీ ఒక అమెరికా కంపనీ. పేరు Airbnb Inc.ఇది లాడ్జింగ్, హోమ్‌స్టే, టూరిజం రంగాలలో పని చేస్తుంది.
మీరు ఏ దేశంలోనైనా పని చేయవచ్చని ఈ సంస్థ ఉద్యోగులకు సూచించింది. కావాలంటే చౌకైన నగరంలో నివసించమని తెలిపింది. అంతేకాదు జీతంలో ఎటువంటి కోత ఉండదని చెప్పింది. Airbnb Inc సీఈవో బ్రియాన్ చెస్కీ కంపెనీ కొత్త విధానం గురించి ఉద్యోగులకు ఈ మెయిల్‌లో పంపించారు. దీనివల్ల అందరికి అనుకూల వాతావరణం ఉంటుందని తెలిపారు.
Airbnb Incలో దాదాపు 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు అమెరికా నుంచి మిగిలిన వారు ఇతర దేశాల నుంచి పనిచేస్తున్నారు. ఇందులో ఇండియా నుంచి పనిచేసేవారు కూడా ఉన్నారు. కంపెనీ లాభం గురించి మాట్లాడితే 2021లో 25 శాతం పెరుగుదల ఉంది. కంపెనీ ఈ ప్రకటనతో చాలా మంది ఉద్యోగులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కంపెనీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.