Adani Enterprises: ఎఫ్‌పీవో డబ్బు వాపస్ చేస్తున్నట్టు ప్రకటించిన గౌతమ్ అదానీ

Adani Enterprises: ఎఫ్‌పీవో డబ్బు వాపస్ చేస్తున్నట్టు ప్రకటించిన గౌతమ్ అదానీ

Update: 2023-02-02 10:16 GMT

Adani Enterprises: ఎఫ్‌పీవో డబ్బు వాపస్ చేస్తున్నట్టు ప్రకటించిన గౌతమ్ అదానీ

Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేరు ధర దారుణంగా పడిపోవడం, దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న క్రమంలో గౌతమ్ అదానీ స్పందించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు FPO డబ్బు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. అదానీ ఎంటర్​ప్రైజస్​లిమిటెడ్​షేరు ధర దారుణంగా పడిపోతుండమే ఈ నిర్ణయానికి కారణమని అదానీ వెల్లడించారు. వ్యాపారవేత్తగా 4 దశాబ్దాలకుపైగా సాగుతున్న ప్రయాణంలో వాటాదారులంతా తనతో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకాలం పెట్టుబడిదారుల సంఘం నుండి మద్దతు లభించిందన్నారు. ఇకపై కూడా వారి మద్దతు అవసరమని, తన విజయాలన్నింటికీ వారికి రుణపడి ఉంటాననీ అదానీ వెల్లడించారు. తనకు పెట్టుబడిదారుల ప్రయోజనాలే ప్రధానమని, అందుకే పెట్టుబడిదారులను నష్టాల నుండి రక్షించడానికి FPOని ఉపసంహరించుకున్నానంటూ అదానీ వీడియో రిలీజ్ చేశారు.

Tags:    

Similar News