Aadhaar Card: ఆధార్‌ కార్డ్‌ కూడా ఏటీఎం కార్డే.. ఇంటి దగ్గరి నుంచే రూ.50 వేలు విత్‌ డ్రా..!

Aadhaar Card:ఆధార్‌ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ముఖ్యమైన పత్రం.

Update: 2024-05-18 09:10 GMT

Aadhaar Card: ఆధార్‌ కార్డ్‌ కూడా ఏటీఎం కార్డే.. ఇంటి దగ్గరి నుంచే రూ.50 వేలు విత్‌ డ్రా..!

Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ముఖ్యమైన పత్రం. ఇది లేకుంటే దేశ పౌరుడిగా గుర్తింపు పొందడం చాలా కష్టం. సొసైటీలో ఒక వ్యక్తికి సంబంధించిన ఏ పని జరగాలన్నా ఆధార్‌ అవసరమవుతుంది. మీరు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేయాలన్నా, స్కూల్‌లో పిల్లలను జాయిన్‌ చేయాలన్నా, ఇన్సూరెన్స్‌ వంటి స్కీమ్‌లు తీసుకోవాలన్నా ఆధార్‌ అవసరం. అంతేకాదు ఆస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లు, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ మొదలైన వాటికి ఆధార్‌ అవసరమవుతుంది. అయితే ఇవి మాత్రమే కాదు ఇప్పుడు ఆధార్‌ కార్డు ఏటీఎం కార్డులా కూడా పనిచేస్తుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు అనేది సర్టిఫికేట్స్ లేదా స్కీమ్స్ ఇలాంటి వాటికే యూస్ అవుతోంది అనుకుంటారు కానీ దానిని ఏటీఎమ్‌లా కూడా వాడొచ్చు. బ్యాంకుకు వెళ్లకుండా ఆధార్ కార్డుతో రూ.50 వేల నగదు తీసుకోవచ్చు. రూరల్‌ ఏరియాల్లో బ్యాంకులు గ్రామాలకు దూరంగా ఉంటాయి. దీంతో వాళ్లు బ్యాంకులకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వారికోసమే ఏఈపీఎస్ అనే సిస్టమ్‌ రూపొందించారు. దీనిని ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. దీని ద్వారా బ్యాంకుకు వెళ్లకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

అయితే తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్‌కు లింక్ అయి ఉండాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పద్దతి ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేస్తున్నారు. దీని కోసం మీరు బ్యాంకుకు వెళ్లకుండా ఆధానెంబర్ టైప్ చేసి, బయోమెట్రిక్ ఇవ్వాలి. దీంతో మీ డబ్బులు బ్యాంక్ మిత్ర అకౌంట్ లోకి వెళ్తాయి. వారు ఆ డబ్బును మీకు విత్‌ డ్రా చేసి ఇస్తారు. ఉపాధి హామి పథకం డబ్బులు తీసుకునేవారు, పెన్షన్ తీసుకునేవారు చాలామంది ఈ పద్ధతిలోనే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీని లిమిట్‌ను ఇప్పుడు రూ.50 వేల వరకు పెంచారు.

Tags:    

Similar News