రైల్వే ప్రయాణికులకి గమనిక.. చిన్న పొరపాటు పెద్ద తప్పిదానికి కారణం..!

Train Ticket: రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయణించవచ్చు.

Update: 2023-08-19 05:58 GMT

రైల్వే ప్రయాణికులకి గమనిక.. చిన్న పొరపాటు పెద్ద తప్పిదానికి కారణం..!

Train Ticket: రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయణించవచ్చు. అయితే రైలు టికెట్‌ తీసుకునే సమయంలో చిన్న పొరపాటు వల్ల పెద్ద నష్టాన్ని భరించవలసి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణమైనా, తక్కువ దూర ప్రయాణమైనా కచ్చితంగా టికెట్‌ తీసుకోవాలి. అయితే రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు లేదా కౌంటర్‌లో టికెట్‌ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

కొంతమంది టికెట్‌ని ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకుంటారు మరికొంత మంది స్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ ద్వారా తీసుకుంటారు. అయితే రైలు టిక్కెట్‌లో చాలా సమాచారం ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసే వ్యక్తి ఈ సమాచారాన్ని సరిగ్గా గమనించాలి. దానిపై గమ్యస్థానం పేరు ఖచ్చితంగా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది మీరు వెళ్లే గమ్యస్థానమేనా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారు.

టికెట్ కొనుగోలు చేసిన తర్వాత గమ్యస్థాన స్టేషన్ పేరును ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. రైల్వే కౌంటర్ నుంచి టికెట్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు హడావుడిగా మరికొన్నిసార్లు మానవ తప్పిదం వల్ల స్టేషన్ పేరు తప్పుగా పడవచ్చు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలోనే అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, న్యూఢిల్లీ, ఢిల్లీ కాంట్, ఢిల్లీ సరైరోహిల్లా, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మీరు టిక్కెట్ కౌంటర్‌లో ఢిల్లీలోని ఏదైనా స్టేషన్‌కి టికెట్‌ అడిగితే వారు హడావిడిలో ఢిల్లీ స్టేషన్‌కి మాత్రమే టికెట్‌ ఇస్తారు. దీనివల్ల మీరు దిగాల్సిన స్టేషన్‌ వరకు టికెట్‌ పనిచేయదు.

ఇదికాకుండా కొన్నిసార్లు వేరే స్టేషన్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే రైల్వే టిక్కెట్ తీసుకునేటప్పుడు రైల్వే స్టేషన్ పూర్తి పేరు చెప్పాలి. ఆపై టికెట్ తీసుకోవాలి. కౌంటర్‌ వద్ద ఉండే గందరగోళం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టికెట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రయాణంలో టీసీ వల్ల ఇబ్బందిపడుతారు. అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News