Today Horoscope in Telugu 19th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Today Horoscope in Telugu 19th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-08-19 00:30 GMT

Today Horoscope in Telugu 19th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

19-08-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : పౌర్ణమి రాత్రి గం.11.55 ని.ల వరకు ఆ తర్వాత కృష్ణ పాడ్యమి

నక్షత్రం: శ్రవణం ఉదయం గం.8.10 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ఠ రేపు తె.వా.గం.5.45 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.8.24 ని.ల నుంచి గం.9.50 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.46 ని.ల నుంచి గం.1.12 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.45 ని.ల నుంచి గం.1.35 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.17 ని.ల నుంచి గం.4.07 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.35 ని.ల నుంచి 9.10 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.00 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.39 ని.లకు

మేషం :


అనుకూలంగా ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పొదుపు చర్యలు ఫలిస్తాయి. అవకాశాలు కలిసివస్తాయి. గృహశాంతి ఉంటుంది. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం.

వృషభం :


పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక చిక్కులుంటాయి. శత్రుపీడ పెరుగుతుంది. ఉన్నత విద్యకు ఆటంకాలుంటాయి. త్వరగా అలసిపోతారు. చికిత్సకు ఖర్చు చేస్తారు. తండ్రితో విభేదిస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.

మిథునం :


లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. అవరోధాలు వస్తాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల కోపానికి గురవుతారు. వీలునామా వ్యవహారాలు బెడిసికొడతాయి. వాహనం నడిపేప్పుడు జాగ్రత్త. కోపం తగ్గించండి.

కర్కాటకం:


 అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. ఇరుగు పొరుగుతో చికాకులు తొలగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. శారీరక ఆనందం పొందుతారు. పోటీల్లో గెలుస్తారు.

సింహం :


 కార్యజయం ఉంది. స్వస్థాన ప్రాప్తి గోచరిస్తోంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటారు. బలహీనతలను అధిగమిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య :


 పనిపై శ్రద్ధ పెంచాలి. బద్ధకం కూడదు. అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాలి. మీ తెలివితేటలకు తగ్గ గుర్తింపు ఉండదు. నిరాశను దగ్గరకు రానీయకండి. అందరితోనూ సఖ్యత కొనసాగించండి. విజయం సిద్ధిస్తుంది.

తుల :


 ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. అనవసర గొడవలకు ఆస్కారం ఉంది. డబ్బు ఇబ్బందికి తోడు వృథా ఖర్చుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది. రక్త సంబంధీకులు సహకరిస్తారు.

వృశ్చికం :


 వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రుల వల్ల లబ్దిని పొందుతారు. కీలక వర్తమానం అందుతుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది.

ధనుస్సు :


 కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. అనుకున్నవి జరగకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. వృథా ఖర్చులుంటాయి. మనసులోని మాట స్పష్టంగా చెప్పలేక చిక్కుల్లో పడతారు.

మకరం :


తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక లాభం ఉంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. నిరుద్యోగులకు శుభంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందులో పాల్గొంటారు.

కుంభం :


 వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. అనూహ్య ఖర్చులొస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేయాలి. బద్ధకం వద్దు. నిద్రలేమి వేధిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనం :


కోరికలు నెరవేరతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇష్టమైనవారితో విందులో పాల్గొంటారు. ప్రయాణాలు వినోదాన్నిస్తాయి. సంతానం గురించి ఆలోచిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బావుంటుంది.

Tags:    

Similar News