Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 19 September 2024

Today Horoscope in Telugu, 19 September 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Update: 2024-09-19 00:30 GMT

Today Horoscope in Telugu

Today Horoscope in Telugu, 19 September 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్షరుతువు, కృష్ణ పక్షం

తిధి: విదియ అర్ధరాత్రి గం.12.39 ని.ల వరకు ఆ తర్వాత తదియ

నక్షత్రం: ఉత్తరాషాఢ ఉదయం గం.8.04 ని.ల వరకు ఆ తర్వాత రేవతి రేపు తె.వా.గం.5.15 ని.ల వరకు

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక గం.3.08 ని.ల నుంచి గం.4.32 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.39 ని.ల నుంచి రాత్రి గం.8.04 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.08 ని.ల నుంచి గం.10.57 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.3.49 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.41 ని.ల నుంచి గం.3.12 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.05 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.15 ని.లకు

మేషం 

పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అనూహ్య ఖర్చులు వస్తాయి. మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. బద్ధకం వదలండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎడమ కంటికి సమస్య వస్తుంది.

వృషభం 

పెద్దలతో కీలకమైన అంశాలను చర్చిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. విందుకు హాజరవుతారు. సంతానం తీరు తృప్తినిస్తుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.

మిథునం 

వ్యవహారాలు మీ అజమాయిషీలోకి వస్తాయి. సామాజిక స్థితి వృద్ధి చెందుతుంది. అన్నిరంగాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. మిత్రులను కలుస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది.

కర్కాటకం

పనులు అనుకున్న స్థాయిలో జరగవు. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానం తీరు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. వైద్య అవసరాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహం 

ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. వారసత్వపు ఆస్తి వ్యవహారంలో జాప్యం కలుగుతుంది. చెడు ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి.

కన్య 

అనుకూల ఫలితాలుంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్తవారితో బంధాలు బలపడతాయి. ప్రయాణం వల్ల లబ్ది చేకూరుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. కీర్తి వృద్ధి చెందుతుంది.

తుల 

కార్యజయం ఉంది. పూర్వ స్థితికి చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం బావుంటుంది. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలు తొలగిపోతాయి.

వృశ్చికం 

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల మీపై సదభిప్రాయం పోతుంది. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి నిలకడగా ఉండదు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త.

ధనుస్సు 

పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతగా తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. సహచరులతో వివాదాలు గోచరిస్తున్నాయి. శత్రుపీడ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

మకరం 

కీలక వర్తమానం అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక విషయాలు తృప్తినిస్తాయి. సోదరులు సహకరిస్తారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం 

అనవసర జోక్యాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. ఎవరికీ ఎటువంటి హామీని ఇవ్వకండి. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం 

అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. గృహోపకరణాలను కొంటారు. విందులో పాల్గొంటారు. అన్ని రంగాల్లోని వారికి శుభంగా ఉంటుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. విజ్ఞానాభివృద్ధికి అనుకూలం. 

Tags:    

Similar News