Telugu Horoscope Today 17 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Telugu Horoscope Today 17 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Update: 2024-09-17 00:30 GMT

Telugu Horoscope Today 17 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

17-09-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి: చతుర్దశి ఉదయం గం.11.44 ని.ల వరకు ఆ తర్వాత పౌర్ణమి

నక్షత్రం: శతభిషం మధ్యాహ్నం గం.1.53 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: ఉదయం గం.7.29 ని.ల నుంచి గం.8.54 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.58 ని.ల నుంచి గం.5.22 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.7.31 ని.ల నుంచి గం.8.56 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.31 ని.ల నుంచి గం. 9.20 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.00 ని.ల నుంచి గం.11.47 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి సా.గం. 4.45 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.16 ని.ల కు

సూర్యాస్తమయం: సా. గం. 5.51 ని.లకు

మేషం

పనులు సవ్యంగా సాగుతాయి. అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాల్లో మిత్రులు తోడుగా నిలుస్తారు. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

వృషభం

అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులకు చాలా మేలైన ఫలితాలుంటాయి. సహచరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మిథునం

పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సంతానం తీరుతో విభేదిస్తారు. బంధువులతో సఖ్యత చెడుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఇంటికి దూరంగా వెళ్లే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. తగాదాలకు దూరంగా ఉండండి. తొందరపాటు వల్ల అధికారుల కోపానికి గురవుతారు. అపోహలు పెరుగుతాయి. మనశ్శాంతిని కోల్పోతారు.

సింహం

ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో సంతృప్తి లభిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

కన్య 

అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఆకాంక్ష నెరేవరుతుంది. మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రత్యర్థులపై గెలుస్తారు.

తుల

పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. బద్ధకం వీడి కష్టపడండి. శత్రుపీడ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే సూచన ఉంది. ఈరోజు సొంత తెలివితేటలు వాడకండి. విలువైన వస్తువులు జాగ్రత్త.

వృశ్చికం

బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధువర్గంతోనే విభేదాలు గోచరిస్తున్నాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పరుస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. రహస్యాలు దాచాల్సి వస్తుంది.

ధనుస్సు

ఆదాయం మెరుగవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. మిత్రులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది.

మకరం

బ్యాంకు లావాదేవీలు ముందుకు సాగవు. విషయాన్ని స్పష్టంగా చెప్పలేక పోతారు. అవమానానికి గురయ్యే సూచన ఉంది. కుటుంబంలోనూ చిక్కులుంటాయి. అకారణ విరోధు బసకీటపేబీ. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది.

మీనం

పనులు అనుకున్నట్లుగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. పరిహారం చెల్లించే పరిస్థితి గోచరిస్తోంది.


Full View


Tags:    

Similar News