Telugu Horoscope Today 28th September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Telugu Horoscope Today 28th September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Update: 2024-09-28 00:30 GMT

Telugu Horoscope Today 28th September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

28-09-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి మధ్యాహ్నం గం.2.49 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: ఆశ్లేష అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.38 ని.ల వరకు ఆ తర్వాత మఖ

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.1.53 ని.ల నుంచి గం.3.38 ని.లకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.22 ని.ల నుంచి గం.5.07 ని.లకు

దుర్ముహూర్తం : ఉదయం గం.6.06 ని.ల నుంచి గం.7.42 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.06 ని.ల నుంచి గం. 10.36 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.07 ని.లకు

మేషం :


మీవంటి మనస్తత్వం ఉన్నవారి పరిచయం కలుగుతుంది. స్వజనులతో విరోధం గోచరిస్తోంది. పనులు సవ్యంగా గవు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. వృథా ఖర్చులు తగ్గించాలి. నీటి వనరుల దగ్గర జాగ్రత్త.

వృషభం : 


రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సోదరుల తోడ్పాటుతో కీలక కార్యాలను సాధిస్తారు. సహోద్యోగులు సహకరిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. కీలక సమాచారం లభిస్తుంది.

మిథునం :


పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అంగీకరించిన పనిని సవ్యంగా చేయని ఫలితంగా మాట పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల తీరూ వేదనకు గురి చేస్తుంది. వృథా ఖర్చుంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది.

కర్కాటకం:


 అదృష్టం అన్నివిధాలా అండగా ఉంటుంది. అన్ని వ్యవహారాలూ సజావుగా సాగుతాయి. విందుకు హాజరవుతారు. వాహనయోగం ఉంది. నిరుద్యోగులకు శుభవర్తమానం అందుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

సింహం :


 అనుకోకుండా విపరీతమైన ఖర్చులు వచ్చిపడతాయి. అవసరానికి అప్పూ చేయాల్సి రావచ్చు. మిత్రుల వ్యవహారంలో తప్పు వల్ల విరోధం తలెత్తే సూచన ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. నిద్రలేమి వేధిస్తుంది.

కన్య :


 ఇష్టకార్య సిద్ధి ఉంది. వ్యవహారాలన్నీ ఊహించిన రీతిలో లాభదాయకంగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శుభ కార్యాచరణ దిశగా ఆలోచిస్తారు. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు.

తుల :


 వ్యవహార జయం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తిగత జీవితాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. వివిధ సుఖప్రాప్తి ఉంది. ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది.

వృశ్చికం :


 పనులకు ఆటంకాలు తప్పవు. బుద్ధి బలం పనిచేయదు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచనలను పాటించండి. శత్రువులు బలహీనతలపై దెబ్బ కొడతారు. జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు :


 అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగక పోవడం ఆవేదనకు కారణం అవుతుంది. పోటీలకు వెళ్లకండి. పైత్య సంబంధ సమస్య ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మకరం :


 కీలక వ్యవహారాలన్నింటిలో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు.

కుంభం :


 పనులన్నీ విజయవంతం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. బంధువులను కలుస్తారు. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల అండతో వివాదం పరిష్కారం అవుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

మీనం :


 అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టకార్యం భగ్నమవుతుంది. విరోధం వృద్ధి చెందే సూచన ఉంది. సొంత తెలివితేటలను ప్రదర్శించకండి. అనుమానాలు, బద్ధకాన్ని వీడి కష్టపడాలి. వాత సమస్య ఉంటుంది.

Tags:    

Similar News