Telugu Horoscope Today 25th September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Telugu Horoscope Today 25th September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Update: 2024-09-25 00:30 GMT

25-09-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : అ ష్టమి మధ్యాహ్నం గం.12.10 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: ఆరుద్ర రాత్రి గం.10.23 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.11 ని.ల నుంచి గం.1.49 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.6.28 ని.ల నుంచి గం.8.06

దుర్ముహూర్తం : ఉదయం గం.11.43 ని.ల నుంచి మధ్యాహ్నం గం. 12.32 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.08 ని.ల నుంచి గం.1.38 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.10 ని.లకు

మేషం :


కార్యాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. చేస్తున్న వృత్తిలో సంతృప్తి లభిస్తుంది. భవిష్యత్తు గురించిన ఆలోచనలను ఆచరణలో పెడతారు. సోదరులు తోడుంటారు. చుట్టుపక్కల వారితో సఖ్యత ఏర్పడుతుంది.

వృషభం : 


పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బాగా కష్టపడితేనే ఫలితం వుంటుంది. డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. వేళకు భోజనముండదు.

మిథునం : 


శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. మీ వ్యక్తిత్వంతో సహచరులను ఆకట్టుకుంటారు. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం:


 అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లోపం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా గడుపుతారు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

సింహం :


 ఆర్థికంగా బాగుంటుంది. గృహోపకరణాలను కొంటారు. సంతాన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి వ్యవహారమూ లాభసాటిగానే ఉంటుంది. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

కన్య :


 అభీష్టం నెరవేరుతుంది. అన్ని పనుల్లో విజయాన్ని పొందుతారు. ఉద్యోగుల సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలను చేపట్టే వీలుంది. అవకాశాలను ఉపయోగించుకోండి. మనశ్శాంతి లభిస్తుంది.

తుల :


 ప్రయత్నాలు అంత సజావుగా సాగవు. ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. ఉద్యోగులు అతి జాగ్రత్తగా ఉండాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది. ప్రయాణం వల్ల లాభం లేదు. పెద్దలను కలుస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం :


 పనులు అనుకున్న రీతిలో సాగవు. తగాదాలు మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి. పోటీ పడకపోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఉద్యోగులు ఇష్టం లేని చోటికి బదిలీ అయ్యే వీలుంది. శత్రుపీడ పెరుగుతుంది.

ధనుస్సు :


 పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతో బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది.

మకరం :


 వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది. బలహీనతలను జయిస్తారు. అపార్థాలు, వివాదాలు తొలగి పోతాయి. కీర్తి పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కుంభం :


 దొంగతనం మూలంగా డబ్బు నష్టపోయే సూచన ఉంది. పనులకూ ఆటంకాలు పెరుగుతాయి. మానసిక వ్యథ కలుగుతుంది. నిరాశను వదిలి సవ్యంగా ఆలోచించండి. తెలివితేటలు పనిచేయవు. బద్ధకాన్ని వదలాలి.

మీనం :


బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతోనూ విరోధం గోచరిస్తోంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు వద్దు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. అనుమానాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు లాభించవు.


Full View


Tags:    

Similar News