Weekly Horoscope 22 To 28 September 2024: వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. 12 రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope 22 To 28 September 2024: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పరిచయాలతో కొండంత అండ.. 12 రాశుల వారి వార ఫలాలు

Update: 2024-09-22 00:30 GMT

Weekly Horoscope 22 To 28 September 2024: వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. 12 రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే?

(22-09-2024 నుంచి 28-09-2024 వరకు)

మేషం


 కొన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. నాయకత్వ పటిమ, ధైర్యసాహసాలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీకు అందే కీలక సమాచారం ఆనందపరుస్తుంది. తోబుట్టువులు, దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం వల్ల కోరుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల అవమానం ఎదుర్కొంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టపోయే సూచన ఉంది. మీ సహాయకుల వల్ల చిక్కుల్లో పడతారు. రెండో పెళ్లి ప్రయత్నం అనుకూలించదు

పరిహారం: దుర్గామాతను పూజించడం వల్ల వ్యతిరేకతలు తొలగిపోయే వీలుంది. ఎరుపు వర్ణం కలిసిన దుస్తులను ధరించడం మేలు చేస్తుంది.

వృషభం


 శుభప్రదంగా ఉంటుంది. వ్యవహారాలన్నీ విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్న ప్రయత్నానికి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో సోదరులు అండగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎవరికీ పూచీగా ఉండకండి. ముందుచూపు లేమి వల్ల సహచరులకూ సాయం లేని పరిస్థితిలో పడతారు. తగాదాలకు దూరంగా ఉండండి. వృథాఖర్చులను తగ్గించండి.

పరిహారం : శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించడం వల్ల పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించడం మంచిది.

మిథునం


 పనుల పూర్తికి కాస్తంత శ్రమించాల్సి వుంటుంది. అవసరమైన మేరకు డబ్బు సమకూరుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. వృత్తిగతంగా మెరుగైన స్థాయికి చేరుకుంటారు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మనోల్లాసాన్ని పొందుతారు. విందులో పాల్గొంటారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీలైన మేరకు అనవసర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకండి. కంటికి సంబంధించిన చికాకు ఉంటుంది.. ఆస్తి వ్యవహారాలు జాగ్రత్త. విడాకుల అంశం తేలే అవకాశం లేదు.

పరిహారం : ఆంజనేయ స్వామి వారిని అర్చించడం వల్ల శుభ ఫలితాలుంటాయి. సింధూర వర్ణం కలిసిన దుస్తులను ధరిస్తే మేలు జరుగుతుంది.

కర్కాటకం :


 పనులన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాలం ఆనందంగా సాగుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దవారి ఆశీస్సులు పొందుతారు. అదృష్టం తోడుగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. కీర్తి పెరుగుతుంది. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో విరోధం ఏర్పడే వీలుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. వేళకు భోజనం ఉండదు. నిద్రలేమి వేధిస్తుంది.

పరిహారం : శివుణ్ణి పూజించడం వల్ల మేలు కలుగుతుంది. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలు ధరించడం శుభాన్ని చేకూరుస్తుంది.

సింహం


 ఆకాంక్ష నెరవేరుతుంది. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఇంటి వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంతాన సంబంధ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులూ సహకరిస్తారు. బంధాలు బలపడతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారం చివరలో దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు.

పరిహారం : సాయిబాబా దర్శనం మరింత శుభప్రదంగా ఉంటుంది. తెల్లటి రంగు కలిసిన దుస్తులను వేసుకోవడం వల్ల ప్రశాంతత పెరుగుతుంది.

కన్య


కోర్కెలు నెరవేరతాయి. పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధాలు బలపడతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలను పొందుతారు. నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో స్థిరనిర్ణయం తీసుకుంటారు. అవకాశఆలను చేజార్చుకోకండి. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. సంతాన సంబంధ శుభ కార్యాచరణకు శ్రీకారం చుడతారు. దైవ చింత పెరుగుతుంది. వారం చివరలో వృథా ఖర్చులుండే వీలుంది. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. భవిష్యత్తుకు చెందిన ప్రణాళికలు వేస్తారు.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల కార్యాలు మరింత విజయవంతం అవుతాయి. పపుసు రంగు కలిసిన దుస్తులు ధరించండం మేలు.

తుల


 ఉద్యోగులకు శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అలవాటవుతుంది. అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలను చేజార్చుకునే సూచన ఉంది. జాగ్రత్త. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంట్లో శాంతి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పెద్దల అభిమానాన్ని చూరగొంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. బంధువులతో విందులో పాల్గొంటారు.ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల తగాదాలు వస్తాయి. పోటీలలో ఓటమి సూచిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. జీర్ణ సమస్య ఉంటుంది.

పరిహారం : గణపతిని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉపశమిస్తాయి. తెల్లని రంగు కలిసిన దుస్తులను వేసుకోవడం వల్ల శుభ ఫలితాలుంటాయి.

వృశ్చికం


 కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామి తోడ్పాటునిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. అంతర్గతమైన ఆకాంక్ష నెరవేరడం వల్ల ఆనందం పెరుగుతుంది. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. సంతాన వ్యవహారాల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఆకస్మికంగా పతనమైన భావన కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. దైవ చింతన వృద్ధి చెందుతుంది.

పరిహారం : నవగ్రహాలకు ప్రదక్షిణలు, పూజలు ప్రశాంతతనిస్తాయి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల మేలు కలుగుతుంది.

ధనుస్సు


 పనులు అనుకున్నట్లే చకచకా పూర్తవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ప్రతి ప్రయత్నంలోనూ శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు క్రమంగా అనుకూలిస్తాయి. డబ్బుకి పెద్దగా ఇబ్బంది ఉండదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బలహీనతలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక వ్యవహారంలో జయాన్ని పొందుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అపార్థాలు తొలగిపోతాయి. వారం చివరలో వృథా ఖర్చులను అదుపు చేయాలి. తగాదాలకు దూరంగా ఉండండి. అకారణ భయం ఏర్పడుతుంది.

పరిహారం : ఇష్టదైవాన్ని అనునిత్యం స్మరిస్తూ ఉండండి. పరిస్థితులు సానుకూలపడతాయి. ముఖ్య కార్యాలకు వెళ్లేటప్పుడు ఊదారంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మకరం


 పట్టింది బంగారంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ధన సంబంధ చిక్కులు తొలగిపోతాయి. రుణ విముక్తి ప్రయత్నాలూ అనుకూలిస్తాయి. ఈ విషయంలో, బంధుమిత్రులు తోడ్పడతారు. కొత్త వస్తువులను కొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాలకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సూచన పాటించడం వల్ల కుటుంబ వ్యవహారం చక్కబడుతుంది. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. సంతాన సంబంధ వ్యవహారం చికాకు పెడుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు.

పరిహారం : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం వల్ల చిక్కులు తొలగే వీలుంది. సింధూర వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం


 ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కీర్తి పెరుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. బలహీనతలను జయిస్తారు. మనశ్శాంతిని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృథా ఖర్చులనూ తగ్గించాలి. తల్లి ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం. సంతానం తీరు చికాకు పెడుతుంది. నీచమైన ఆలోచనలను కట్టిపెట్టండి. సొంత తెలివితేటలను ఉపయోగించకండి. వాహన సమస్యలు పెరుగుతాయి. అవమానానికి ఆస్కారముంది.

పరిహారం : శనైశ్చరుడికి ప్రదక్షిణలు, నువ్వుల నూనెతో అభిషేకం ప్రశాంతతనిస్తాయి. నల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించడం శ్రేయోదాయకం.

మీనం


 అనుకున్న పని నెరవేరుతుంది. డబ్బుకి సంబంధించిన చిక్కులూ తొలగిపోతాయి. సోదరుల అండతో కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. అన్నివైపులా మంచి ఫలితాలే వస్తాయి. మీలోని నాయకత్వ లక్షణాలకు, సేవా గుణానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఎదురు చూస్తున్న శుభ సమాచారం అందుతుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రతికూల సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఇంటి వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగక పోవడం ఆందోళనను కలిగిస్తుంది. సంతానం వైఖరిని విభేదిస్తారు. ఒంటరితనాన్ని కొరుకుంటారు. ఉదర సంబంధ సమస్య వస్తుంది.

పరిహారం : శ్రీ దక్షిణామూర్తిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తెల్లని రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది.

Tags:    

Similar News