Telugu Horoscope Today 16th September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 16th September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-09-16 00:30 GMT

Telugu Horoscope Today 16th September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

16-09-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : ద్వాదశి సాయంత్రం గం.6.12 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి

నక్షత్రం: శ్రవణము సాయంత్రం గం.6.49 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట

అమృతఘడియలు: ఉదయం గం.9.10 ని.ల నుంచి గం.10.39 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.10.26 ని.ల నుంచి గం.11.53 ని.ల వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం గం.4.40 ని.ల నుంచి గం.5.29 ని.ల వరకు

రాహుకాలం : సాయంత్రం గం.4.46 ని.ల నుంచి గం.6.18 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.18 ని.లకు

మేషం : 


శుభప్రదంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. గృహశాంతి ఉంటుంది.

వృషభం : 


అపాత్రదానం వల్ల మీరే చిక్కుల్లో పడతారు. ధనసంబంధ వ్యవహారాలు ఇబ్బందిపెడతాయి. న్యాయపరమైన వివాదాలు, రాజీ ప్రయత్నాలు మందగిస్తాయి. వైద్యం కోసం ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

మిథునం : 


పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. అపోహలు పెరుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభించదు. తగాదాలకు ఆస్కారం ఉంది.

కర్కాటకం:


భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ప్రయాణం లాభిస్తుంది. మిత్రులతో విందులో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహం :


 పనులు సవ్యంగా సాగుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. దైవచింతన వృద్ధి చెందుతుంది.

కన్య :


 అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల వివాదాలు తలెత్తుతాయి. తెలివితేటలు అక్కరకు రావు. బద్ధకం వదలాలి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. ఖర్చు తగ్గించాలి.

తుల :


 కార్యనష్టాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. మిత్రులతోనే గొడవలు వస్తాయి. శత్రుపీడ పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు తృప్తినివ్వవు. విద్యాసంస్థల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం :


 శుభ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పనులను సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనే సూచన ఉంది. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. కనిష్ట సోదరుల అండతో ఆస్తి వ్యవహారాలు పరిష్కరిస్తారు.

ధనుస్సు :


నోటి దురుసు తగ్గించండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లు ఉండవు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.

మకరం :


 రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సౌకర్యాలు సమకూరతాయి. సమస్య పరిష్కారంలో అదృష్టం తోడుంటుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. బాల్యస్మృతులు తృప్తినిస్తాయి.

కుంభం :


 వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. బద్ధకం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసర ప్రయాణాలు మానండి. నష్ట పరిహారం చెల్లించాల్సి రావచ్చు. పోటీల్లో ప్రత్యర్థులకే అనుకూలం.

మీనం :


 కాలం ఆనందంగా సాగిపోతుంది. అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దవారిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.

Tags:    

Similar News