Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 20 September 2024

Update: 2024-09-20 00:30 GMT

రాశిఫలం 20-09-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : తదియ రాత్రి గం.9.15 ని.ల వరకు ఆ తర్వాత చవితి

నక్షత్రం: అశ్వని అర్ధరాత్రి దాటిన తర్వాత గం.2.43 ని.ల వరకు ఆ తర్వాత భరణి

అమృతఘడియలు: రాత్రి గం.8.16 ని.ల నుంచి గం.9.42 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.11.08 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.34 ని.ల వరకు

దుర్ముహూర్తం :ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.34 ని.ల నుంచి గం.1.22 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.38 ని.ల నుంచి గం.12.09 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.05 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.14 ని.లకు

మేషం : పనులు అనుకున్నట్లే జరుగుతాయి. తెలివితేటలకు గుర్తింపు ఉంటుంది. సమాజంలోని అంశాలపై స్పందిస్తారు. మానసికస్థితి ఉత్సాహంగా ఉంటుంది. విందులో పాల్గొంటారు. కొత్త అవకాశాలొస్తాయి.

వృషభం : పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక వ్యవహారాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. మానసిక దిగులు ఏర్పడుతుంది. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. వృథా ప్రయాణాలు మానండి. నిద్రలేమి వేధిస్తుంది.

మిథునం : వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బు ఇబ్బందులు ఉండవు. విందులో పాల్గొంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సంతాన వ్యవహారం తృప్తినిస్తుంది. పెద్దవారి ఆశీస్సులు పొందుతారు.

కర్కాటకం: అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. అవకాశాలు చేజార్చుకోకండి. గౌరవం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. డబ్బు వ్యవహారాలు లాభిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది.

సింహం : ఆటంకాలు ఎదురవుతాయి. బలహీనతలను అధిగమించాలి. ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తండ్రితో సయోధ్య చెడే వీలుంది. ప్రయాణాల వల్ల లాభం ఉండదు.

కన్య : అసంతృప్తి కలుగుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. పైవారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. జీర్ణ సంబంధ సమస్య వచ్చే వీలుంది.

తుల : స్వేచ్ఛాజీవితంతపై కోరిక పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా ఉంటాయి. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. విందులో పాల్గొంటారు.

వృశ్చికం : అపోహలు తొలగిపోతాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. బలహీనతలను జయిస్తారు. కీర్తి వృద్ధి చెందుతుంది. మిత్రులను కలుస్తారు.

ధనుస్సు : పనులకు ఆటంకాలు వస్తాయి. అభీష్టం నెరవేరదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు వస్తాయి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రత. కడుపులోని అవయవాల వల్ల సమస్య వచ్చే వీలుంది.

మకరం : ప్రయత్నాలు పెద్దగా ఫలితాలనివ్వవు. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆత్మీయులతో విభేదాలు వచ్చే వీలుంది. విద్యాసంస్థలకు చెందిన వారు అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి క్రయవిక్రయాల్లో నష్టం సూచిస్తోంది.

కుంభం : రోజంతా తృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక చికాకులు ఉండవు. సోదరులు, మిత్రులు తోడ్పాటునిస్తారు. మీ ఆలోచన విధానానికి ప్రశంసలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మీనం : వ్యవహార నష్టం గోచరిస్తోంది. ఇతరులతో సంభాషణల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. మనశ్శాంతి దూరమవుతుంది.

Tags:    

Similar News