Horoscope Today in Telugu 14th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
Horoscope Today in Telugu 14th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
14-09-2024 (శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం
తిధి : ఏకాదశి రాత్రి గం.8.41 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి గం.8.32 ని.ల వరకు ఆ తర్వాత శ్రవణము
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.25 ని.ల నుంచి గం.3.57 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.12.15 ని.ల నుంచి గం. 1.44 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.6.04 ని.ల నుంచి గం.7.42 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.9.08 ని.ల నుంచి గం.10.40 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.19 ని.లకు
మేషం :
పోటీల్లో విజయం సాధిస్తారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. పెద్దల అభిమానాన్ని పొందుతారు. బంధువులతో విందులో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధ కార్యాలు ఫలిస్తాయి.
వృషభం :
అయినవారితోనే విభేదాలు తలెత్తుతాయి. మనసు కలత చెందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. త్వరగా అలసిపోతారు. పెద్దల సూచనలు మేలు చేస్తాయి. సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది.
మిథునం :
పనులు సవ్యంగా సాగవు. పోటీలకు దిగకండి. ధననష్టం గోచరిస్తోంది. ఉద్యోగులు, అధికారుల కోపానికి గురవుతారు. చెప్పుడు మాటలను నమ్మకండి. ఇష్టంలేని చోటుకు వెళ్లాల్సి వస్తుంది. జీర్ణ సమస్య ఉంటుంది.
కర్కాటకం:
బంధాలు బలపడతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. కొత్త వస్తువులు కొంటారు. ప్రయాణం లాభిస్తుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు.
సింహం :
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను దాటేస్తారు. ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి. అపోహ పోతుంది.
కన్య :
ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టే సూచన ఉంది. మీ విశ్లేషణకు సరైన గుర్తింపు లభించదు. ఆలోచనలు సవ్యంగా సాగవు. ఆచితూచి వ్యవహరించకుంటే తగాదాలొస్తాయి. విలువైన వస్తువులను భద్రపరచుకోండి.
తుల :
పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినివ్వవు. రక్త సంబంధీకుల గురించిన సమాచారం అందుతుంది. వృథా ఖర్చులుంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. శ్వాస సమస్యను నిర్లక్ష్యం చేయరాదు.
వృశ్చికం :
ఆదాయం పెరుగుతుంది. పనులు విజయవంతం అవుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరుల తోడ్పాటుతో అగ్రిమెంట్లు కుదురుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం ఉంటుంది.
ధనుస్సు :
ఇతరుల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. ఎన్నో నిందలను భరించాల్సి వస్తుంది. కుటుంబంలోనూ చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. అకారణ విరోధాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
మకరం :
అదృష్టం తోడుగా ఉంటుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. మీ తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.
కుంభం :
ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అపోహల వల్ల బంధు విరోధం ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. వృథా ఖర్చులుంటాయి. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది.
మీనం :
సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. పనులు సవ్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు కొంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెద్దవారి సూచనలు మేలు చేస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది.