Telugu Horoscope Today 12th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 12th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-09-12 00:30 GMT

Telugu Horoscope Today 12th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

12-09-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : నవమి రాత్రి గం.11.32 ని.ల వరకు

నక్షత్రం: మూల రాత్రి గం.9.53 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాషాఢ

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.04 ని.ల నుంచి గం.3.53 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.8.15 ని.ల నుంచి గం.9.53 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.09 ని.ల నుంచి గం.10.58 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.04 ని.ల నుంచి గం.3.53 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.44 ని.ల నుంచి గం.3.16 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.21 ని.లకు

మేషం :


పని పూర్తి చేసే క్రమంలో ఇబ్బందులొస్తాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. అవసరం మేరకు డబ్బు అందుతుంది. పెద్దవారిని కలుస్తారు. రాజీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

వృషభం :


మీ బలహీనత కారణంగా ప్రత్యర్థుల బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురవుతారు. వేళకు భోజనం ఉండదు. తగాదాలకు దూరంగా ఉండండి.

మిథునం :


భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ధనలాభం ఉంది. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. విందులో పాల్గొంటారు.

కర్కాటకం:


 ప్రతి కార్యంలో శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తికరంగా ఉంటాయి. కొత్త వస్తువులను కొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వివాదాలు తొలగిపోతాయి. మనో ధైర్యం పెరుగుతుంది.

సింహం :


 అభీష్టం నెరవేరేందుకు బాగా కష్టపడాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. అనుమానాలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య :


 మిమ్మల్ని సమర్థించే వారితో విభేదం గోచరిస్తోంది. అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వృథా ఖర్చులుంటాయి. ఆలోచన విధానం మారుతుంది. ఆస్తి క్రయవిక్రయాలు లాభించవు.

తుల :


 ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్త్రాలు కొంటారు. కీలక వేళలో మిత్రులు తోడుగా ఉంటారు. సహచరులతో సత్సంబంధాలుంటాయి. మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం :


 డబ్బుతో సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. మాట తప్పడం వల్ల అవమానపడతారు. వేళకు భోజనం ఉండదు. విలువైన వస్తువులను భద్రపరచండి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు :


 శుభప్రదంగా ఉంటుంది. అవసరమైన డబ్బు సమకూరుతుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వాహన యోగం ఉంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది.

మకరం :


 పనులు ఆశించిన రీతిలో సాగవు. బద్ధకం వదిలి పనిచేయండి. అనవసర పంతం వల్ల డబ్బు నష్టపోయే సూచన ఉంది. మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

కుంభం :


ఉల్లాసంగా గడుస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త వ్యక్తులతో పరిచయం లాభసాటిగా ఉంటుంది. పెద్దవారిని కలిసి ఆశీస్సులు పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు.

మీనం :


ఆనందంగా గడుపుతారు. పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి. చక్కటి అవకాశాలు అందివస్తాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

Tags:    

Similar News