Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..26 September, 2024

Telugu Horoscope Today 26 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Update: 2024-09-26 00:30 GMT

Telugu Horoscope Today 26 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

26-09-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : నవమి మధ్యాహ్నం గం.12.25 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: పునర్వసు రాత్రి గం.11.34 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి

అమృతఘడియలు: రాత్రి గం.9.03 ని.ల నుంచి గం.10.43 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.10.59 ని.ల నుంచి మధ్యాహ్నం గం. 12.39 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.07 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.56 ని.ల నుంచి గం 3.44 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.38 ని.ల నుంచి గం. 3.08 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.09 ని.లకు


మేషం :

పనులు అనుకున్నట్లుగా కావు. డబ్బుకి ఇబ్బంది పడతారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావు. సహాయకులే చేటు తెస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  


వృషభం :

పనులు సవ్యంగా సాగుతాయి. అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. సాహసోపేత నిర్ణయం తీసుకుంటారు. సోదరులు అండగా నిలుస్తారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


మిథునం :

కార్యక్రమాలు సజావుగా సాగవు. బ్యాంకు వ్యవహారాలు బెడిసి కొడతాయి. విడాకులు, రెండో పెళ్లి యత్నాలు ముందుకు సాగవు. ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు. కంటికి సంబంధించిన సమస్య వస్తుంది.


కర్కాటకం:

మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధువులతో విందులకు హాజరవుతారు. అంతులేని ఆనందాన్ని పొందుతారు. 


సింహం :

పనుల పూర్తికి ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర జోక్యాల వల్ల సమస్యలొస్తాయి. వృథా ఖర్చు తగ్గించండి. వేళకు భోజనముండదు. మిత్రులతోనూ విరోధం వచ్చే వీలుంది. ప్రయాణం వాయిదా వేయండి.


కన్య :

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక లబ్దిని పొందుతారు. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. మిత్రుల సహకారాన్ని పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఆనందాన్నిస్తాయి.


తుల :

పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. పోటీలలో విజయం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మీ సామర్థ్యానికి ప్రశంసలు లభిస్తాయి. 


వృశ్చికం :

కలహాలకు ఆస్కారం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లుగా ఉండవు. ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. త్వరగా అలసిపోతారు. నిజాయితీకి ప్రశంసలు వస్తాయి. దైవక్షేత్రాలను సందర్శిస్తారు. 


ధనుస్సు :

చెప్పుడు మాటలు నమ్మకండి. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు మీ బలహీనతలపై దెబ్బ కొడతారు. పోటీల్లో దిగకండి. అధికారుల కోపానికి గురయ్యే వీలుంది. మనశ్శాంతి లోపిస్తుంది. 


మకరం :

అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థికంగానూ మెరుగ్గా ఉంటుంది. ప్రయాణం లాభిస్తుంది. ఇతరులతో బంధాలు బలపడతాయి. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.


కుంభం :

అడ్డంకులు తొలగిపోతాయి. పనులు సవ్యంగా సాగుతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. బంధువులు సహకరిస్తారు. వివాదాలు సమసిపోతాయి. విందులో పాల్గొంటారు. ఆరోగ్యాభివృద్ధి ఉంది. 


మీనం :

పనులు అనుకున్న స్థాయిలో జరగవు. నిరాశ కలుగుతుంది. బద్ధకం కూడా తోడై చిక్కుల్లో పడతారు. సంతాన వ్యవహారాలు కోపాన్ని కలిగిస్తాయి. వృథా ఖర్చులుంటాయి. వాత సంబంధ సమస్య ఉంటుంది.


Full View


Tags:    

Similar News