Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 27th September 2024

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 27th September 2024

Update: 2024-09-27 00:30 GMT

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 27th September 2024

27-09-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : దశమి మధ్యాహ్నం గం.1.20 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: పుష్యమి అర్ధరాత్రి దాటిన తర్వాత గం.1.20 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: సాయంత్రం గం.6.28 ని.ల నుంచి రాత్రి గం. 8.11 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.8.09 ని.ల నుంచి గం.9.52 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.30 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.31 ని.ల నుంచి గం.1.19 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.37 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.07 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.08 ని.లకు

మేషం :


జరిగే పరిణామాలు విచారాన్ని కలిగిస్తాయి. అయినవారితోనే విరోధాలు వస్తాయి. మనసు నిలకడగా ఉండదు. ఆస్తి వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. అవమానానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం : 


కీలక సమాచారం ఆనందపరుస్తుంది. కార్యాల్లో స్వశక్తితో విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాన్ని కనబరుస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. దాయాదులతో సమస్యలు పరిష్కారమవుతాయి.

మిథునం :


 ఇచ్చిన మాట నిలుపుకోలేక ఇబ్బంది పడతారు. ఆస్తి నష్టపోయే సూచన ఉంది. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయినవారికి సహాయం చేయలేని నిస్సహాయత ఏర్పడుతుంది.

కర్కాటకం:


 రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. పనులు అనుకున్న రీతిలోనే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బాల్యస్నేహితులతో వినోదంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

సింహం :


 ప్రతి పనికీ ఆటంకాలు వస్తాయి. వ్యవహారాల్లో నష్టపోతారు. బంధువులతో వరోధం మనసును కలత పరుస్తుంది. అనవసర జోక్యాలు వద్దు. వృథాఖర్చులు తగ్గించాలి. కంటికి సంబంధించిన సమస్య ఉంటుంది.

కన్య :


 నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ప్రతి పనీ విజయవంతం అవుతుంది. శుభ కార్యాలకు హాజరవుతారు. మిత్రుల వల్ల లాభపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బావుంటుంది.

తుల :


 వృత్తిగత జీవితం సంతృప్తిగా ఉంటుంది. స్థిరచిత్తంతో చేపట్టే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. డబ్బు ఇబ్బంది ఉండదు.

వృశ్చికం :


పని అనుకున్న రీతిలో సాగదు. అడ్డంకులు సృష్టించే వారు పెరుగుతారు. కడుపు సంబంధ సమస్య ఉంటుంది. ఏమరుపాటుగా ఉంటే ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

ధనుస్సు :


 పనుల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. పోటీల్లో ప్రత్యర్థులకే విజయావకాశాలు ఉంటాయి. అధికారుల కోపానికి గురయ్యే వీలుంది. కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.

మకరం :


 చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విజ్ఞానం పెంచుకోవడానికి అనుకూలం. ప్రయాణం వినోదంగా సాగుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.

కుంభం :


 పనులు శరవేగంగా పూర్తవుతాయి. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. మానసిక చికాకులు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం :


శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు ఉండదు. ఇష్టకార్యం భంగమయ్యే సూచన ఉంది. ఆలోచనలు సజావుగా సాగవు. నిరాశ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. ధననష్టం గోచరిస్తోంది. బద్ధకం వదిలిపెట్టాలి.

Tags:    

Similar News