Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 24 September 2024

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 24 September 2024

Update: 2024-09-24 00:30 GMT

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 24 September 2024

24-09-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : సప్తమి మధ్యాహ్నం గం.12.38 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: మృగశిర రాత్రి గం.9.54 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.11 ని.ల నుంచి గం.2.46 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.30 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.56 ని.ల నుంచి గం.11.44 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.09 ని.ల నుంచి గం.4.40 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.05 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.10 ని.లకు

మేషం :


మానసిక దృఢత్వం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సత్తాను చాటుతారు. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. చురుగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బావుంటుంది. మిత్రులు తోడుంటారు.

వృషభం : 


మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారం చికాకు పెడుతుంది. వేళకు భోజనం ఉండదు. అకారణ విరోధం గోచరిస్తోంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కంటి సమస్య ఉంటుంది.

మిథునం : 


కీలక వ్యవహారంలో అదృష్టం తోడుంటుంది. తెలివితేటలకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. సామాజిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం:


 విపరీతమైన ఖర్చులుంటాయి. వ్యవహారాలు బెడిసికొట్టే సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకుంటే పరిహారం చెల్లించాల్సి వస్తుంది. దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. నిద్రలేమి వేధిస్తుంది. బద్ధకం వద్దు.

సింహం :


 కోరుకున్న పని పూర్తవుతుంది. ఆదాయం బాగుంటుంది. సేవారంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు సంతోషాన్ని పెంచుతాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

కన్య :


 అభీష్టం నెరవేరుతుంది. వృత్తిగత విజయాలు లభిస్తాయి. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. గృహసంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

తుల :


 ఉన్నత విద్యాప్రయత్నాలు ముందుకు సాగవు. అశాంతి కలుగుతుంది. పెద్దలను కలుస్తారు. వైద్య ఖర్చులుంటాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. బలహీనతలను బయటపెట్టకండి. దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం :


 ఆకస్మిక ధన నష్టం గోచరిస్తోంది. బలహీనతలను జయించాలి. శత్రుపీడ పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల వేధింపు ఉంటుంది. సహచరుల సహకారం లభించదు. వేళకు భోజనం ఉండదు. గొడవలు వద్దు.

ధనుస్సు :


 స్వేచ్ఛా జీవితంపై కోరిక పెరుగుతుంది. ఇతరులతో సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సూచన పాటించండి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ శుభకార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తారు.

మకరం :


 పోటీలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వివాదాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విందులో పాల్గొంటారు. పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించే సూచన ఉంది.

కుంభం :


 కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలు కాకుండా నిపుణుల సూచన పాటించండి. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. సమర్థతను నిరూపించుకోలేని పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త.

మీనం :


 పనులు అనుకున్నట్లుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. తల్లివైపు బంధువుల గురించిన సమాచారం అందుతుంది. భూమి కొనుగోలు వ్యవహారం వాయిదా వేయండి.

Tags:    

Similar News