Blue Gemstone: ఈ రాశుల వారు నీలి రంగు రత్నాన్ని అస్సలు ధరించకూడదు.. ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నట్లే..!

Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం గ్రహాల అననుకూల ప్రభావాలను నివారించడానికి రత్నాలను ధరించాలని సూచిస్తుంది.

Update: 2023-08-24 01:30 GMT

Blue Gemstome: ఈ రాశుల వారు నీలి రంగు రత్నాన్ని అస్సలు ధరించకూడదు.. ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నట్లే..!

Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం గ్రహాల అననుకూల ప్రభావాలను నివారించడానికి రత్నాలను ధరించాలని సూచిస్తుంది. రత్నాలకు జ్యోతిష్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. జ్యోతిష్యం కోణం నుంచి ప్రతి గ్రహానికి ఓ రంగు రత్నం ధరించాలని సూచిస్తుంది. కానీ కొంతమంది తమ అభిరుచిలో రత్నాలను ధరిస్తారు. అయితే, జాతకాన్ని విశ్లేషించిన తర్వాత మాత్రమే రత్నాన్ని ధరించాలి. లేకుంటే పెద్ద నష్టం జరగవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, కర్మఫలదాత శని దేవుడికి సంబంధించిన నీలం రత్న గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ రాశుల వారు నీలం రంగు నీలమణిని ధరించకూడదో ముఖ్యంగా తెలుసుకోవాలి.

ఈ వ్యక్తులు నీలరంగు రత్నాన్ని ధరించకూడదు..

రత్న శాస్త్రం ప్రకారం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారు నీలమణిని ధరించకూడదు . ఎందుకంటే ఈ రాశుల అధిపతి శని దేవుడితో శత్రుత్వం కలిగి ఉంటాడు. అందువల్ల, మీరు నీలం రంగు నీలమణిని ధరిస్తే మీ కెరీర్, కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చు. ప్రమాదం జరగవచ్చు. దీంతో పాటు ఇంట్లో ఆనందం, శాంతి కూడా పోతుంది.

ఈ స్థితిలో కూడా నీలమణిని ధరించవద్దు..

జాతకంలో శనిదేవుడు అశుభంగా ఉన్నా నీలమణిని ధరించకూడదు. అలాగే జాతకంలో శని-రాహువు, శని-అంగారకులు ఆరు, అష్టమ, పన్నెండవ స్థానాల్లో ఉంటే నీలం రంగు రత్నాన్ని ధరించకూడదు. అలాగే కెంపు, ముత్యం, పగడాలు నీలమణితో ధరించరాదు. మరోవైపు, శనిదేవుడు తులారాశిలో ఉన్నప్పుడు మాత్రం నీలం రంగు రత్నాన్ని ధరించవచ్చు. ఎందుకంటే శని తులారాశిలో ఉచ్ఛస్థితిలో ఉండి శుభ ఫలితాలను ఇస్తాడు.

Tags:    

Similar News